Pawan Kalyan: ఏపీలో డ్రగ్ మాఫియా.. వైసీపీ పాలనలో కొకైన్ దందా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: దేశంలో డ్రగ్స్ మాఫియా రోజురోజుకీ రెచ్చిపోతుంది. మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా డ్రగ్స్ మహమ్మారి పాకిపోయింది. అలాగే పలు సందర్భాలలో సినీ, రాజకీయ సెలబ్రిటీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ డ్రగ్ మాఫియా, ఇటీవల ఏపీలోని విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడటం, వైసీపీ పాలనలో కొకైన్ దందా అంటూ.. పలు విషయాలను ప్రస్తావిస్తూసంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ట్యాగ్ చేశారు. ఏపీలో వైసీపీ పాలనలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోయిందని పేర్కొన్నారు.

AP Deputy CM Pawan Kalyan tweets on drugs issue in Andhra Pradesh

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ డ్రగ్స్ మానియా పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. 'ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మన ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ అవినీతి నేరపాలన నుంచి సంక్రమించిన మరో వారసత్వ సమస్య ఇది. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, నేర సంబంధిత కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది' అని పేర్కొన్నారు.

AP Deputy CM Pawan Kalyan tweets on drugs issue in Andhra Pradesh

'కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం. దేశంలోని ఇతర ప్రాంతాలలో పట్టుబడిన డ్రగ్స్ కు విజయవాడలోని ఓ వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించాం. గత పాలనలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా సాగింది. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యచరణ, ప్రత్యేక ప్రణాళిక అవసరం' అంటూ పవన్ కళ్యాణ్ సంచలన విషయాలను పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan ycp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X