Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత .. డిప్యూటీ సీఎంకు ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. వరుస రివ్యూలు, పర్యటనలు చేస్తూ తన శాఖలపై పట్టు సాధిస్తున్నారు. తనదైన నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో పవన్ కళ్యాణ్ భాగమయ్యారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు అంతా హోంమంత్రి అవుతారని భావించగా పవన్ మాత్రం గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను తీసుకునేందుకు ముందుకొచ్చారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ పటిష్టంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుని జాతిపిత మహాత్మా గాంధీ కలలు కనేవారు. పవన్‌ది సైతం బాపూజీ బాటే.

AP Dy CM and Janasena Chief Pawan Kalyan Suffering With Fever And Spondylitis

అలాగే ప్రకృతిని పవన్ ఎంతో ఇష్టపడతారు.. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామని ఆయన నమ్ముతారు. అందుకే హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇంటి కన్నా.. నగరానికి దూరంగా ఉండే తన ఫాంహౌస్‌లో ఉండటమే ఆయనకు ఇష్టం. తన వినూత్న ఆలోచనలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల వైపు జనసేనాని మొగ్గుచూపారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

పాలన, రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పటికీ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యేనాటికి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు ఆయన కమిట్ అయ్యారు. వీటిని పూర్తి చేసి నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని భావిస్తున్నారు. తొలుత హరిహర వీరమల్లును పూర్తి చేసి సమ్మర్‌లో రిలీజ్ చేయాలని పవర్‌స్టార్ భావిస్తున్నారు. తనకు వీలు కుదిరినప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

AP Dy CM and Janasena Chief Pawan Kalyan Suffering With Fever And Spondylitis

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్‌తో పవన్ ఇబ్బంది పడుతున్నారని , ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జ్వరం కారణంగా గురువారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చునని పేర్కొన్నాయి. పవర్‌స్టార్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X