జీతం మొత్తం విరాళంగా .. గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఎక్కువ మంది నటుడిగా, రాజకీయ నాయకుడిగా కంటే ఆయన వ్యక్తిత్వం చూసి ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగుతారు పవన్ . కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ఆయన ఎన్నోసార్లు తన సహృదయాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎక్కడ ఏ విపత్తు చోటు చేసుకున్నా తొలుత స్పందించేది పవన్ కళ్యాణే.

పవర్‌ఫుల్ టీమ్‌తో పవన్ యాక్షన్

నేడు పవన్ కళ్యాణ్ ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి.. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు జనసేనాని. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టింది మొదలు నేటి వరకు తన యాక్షన్ ప్లాన్‌తో సుపరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన టీమ్‌లో సమర్ధులైన అధికారులను, సిబ్బందిని తీసుకుని వారి సాయంతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని ఆయన పలుమార్లు తెలిపారు.

AP Dy CM pawan kalyan Donates Monthly Pay to Orphan kids from pithapuram

మోడీకి పవన్ సపోర్ట్

పహల్గామ్ ఉగ్రదాడి, దానికి కౌంటర్‌గా పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ మెరుపు దాడులతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణ నెలకొంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పవన్ కళ్యాణ్ తన నైతిక మద్ధతును తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్‌కు మద్ధతుగా మాట్లాడుతున్న వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

పహల్గమ్ దాడి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం

ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త సోమిశెట్టి మధుసూదనరావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే మధుసూదన్ కుటుంబాన్ని ఓదార్చిన ఆయన పార్టీ తరపున రూ.50 లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు అందిస్తున్నట్లు ప్రకటించారు. వీరు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున తన వేతనం 2,10,000ను కేటాయించడంతో పాటు మిగిలిన మొత్తాన్ని వారి సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్లు జనసేనాని తెలిపారు.

వేతనం మొత్తం వారికే

పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన వేతనాన్ని వారి కోసమే వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను పదవిలో ఉన్నంత కాలం వచ్చే జీతం మొత్తాన్ని పిఠాపురం పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలకే వినియోగిస్తానని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో 32 మంది పిల్లలకి స్వయంగా సాయాన్ని అందజేసిన పవన్ కళ్యాణ్.. మిగిలిన పది మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

More from Filmibeat

Read more about: pawan kalyan janasena pithapuram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X