ఆ జన ప్రభంజనం పవన్ కళ్యాణ్‌కే సాధ్యం.. జనసేనాని అంగీకరించిన వాస్తవం
పవన్ కళ్యాణ్ కోట్లాది మంది ఆరాధ్య దైవం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన తన ప్రతిభ, కష్టంతో పవర్‌స్టార్‌గా ఎదిగారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు, కొత్తదనం కోసం తపన ఆయనను విభిన్నంగా నిలబెట్టాయి. అన్నింటికి మించి సమాజం బాగుండాలి, అందుకోసం తాను చేయగలిగినది చేస్తాననే లక్షణం పవన్ కళ్యాణ్‌ను మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంచాయి. సెట్‌లో లైట్‌బాయ్ నుంచి నిర్మాత వరకు అందరినీ సమానంగా చూడటం, గౌరవించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. సినీ జీవితంలో ఉన్నంత వరకు మీడియా, పబ్లిక్‌కు దూరంగా తన ఫాంహౌస్‌లో ప్రకృతి ఒడిలో సేదతీరడం పవన్‌కు అలవాటు.
ఎప్పుడూ సమకాలీన సమస్యలపై స్పందిస్తూ.. తనను ఇంతటి వాడిని చేసిన జనం ఆపదలో ఉంటే ఫస్ట్ స్పందించేది ఆయనే. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా పేదల అభ్యున్నతి కోసం తన వంతుగా విరాళాలు అందజేశారు. పుస్తకాలు బాగా చదవడంతో పాటు పలువురు సామాజికవేత్తలతో చర్చలు ఆయనపై బలమైన ముద్రను వేశాయి. సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారానికి అధ్యయనం వంటివి పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రారంభించారు. ఈ విషయం ఆయనతో సన్నిహితంగా ఉన్న కొద్దిమందికి మాత్రమే తెలుసు.

సమాజానికి ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ .. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అవినీతిని అస్సలు సహించలేని పవన్.. తన ప్రసంగాల్లో వాడి వేడి విమర్శలు చేసేవారు. ఇవి యువతను ఆలోచింపజేసి ఆయన బాటలో నడిచేలా చేశాయి. తన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ వాటిని ప్రజల్లోకి ముఖ్యంగా యువతరంలోకి బలంగా తీసుకెళ్లారు.
దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత జనసేన పార్టీ ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం పోస్ట్‌తో పాటు ఆరు కీలక శాఖలకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయనకు ఎంతో ఇష్టమైన పోర్ట్‌ఫోలియోలు కావడంతో వీటి ద్వారా తాను చేయాలనుకున్నది చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పవన్. ఇప్పటికే అన్ని శాఖలపై రివ్యూలు చేసిన ఆయన పాలనపై పట్టు పెంచుకుంటున్నారు. తన జట్టులోకి పవర్‌ఫుల్ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను తీసుకున్న ఆయన సమర్ధులైన మరికొందరు అధికారుల కోసం చూస్తున్నారు. వీరి సాయంతో సమాజంలో కాస్తయినా మార్పులు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ఇదిలాఉండగా.. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు జనం పోటెత్తివస్తున్నారంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో ధన ప్రవాహం మొదలయ్యాక.. డబ్బు, బిర్యానీ, మద్యం ఆశ చూపి జనాన్ని సభలకు సమీకరిస్తున్నారు. అధికారంతో బెదిరించి, భయపెట్టి జనాన్ని తరలించేవారు ఉన్నారు. కానీ కేవలం అభిమానం, ఇష్టంతో లక్షలాది మంది సభలకు తరలివచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్‌కే . స్టార్ హీరోలకు జనం రావడంలో వింత ఏమేం ఉంటుందని ప్రత్యర్ధులు ఆరోపిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలు చాలా మందే ఉన్నా ఛరిష్మా , ప్రాణాలిచ్చే అభిమానగణం పవర్‌స్టార్ సొంతం. రాజకీయ నాయకుడిగా మారాక.. ఆయన ఎక్కడ ఏ సభ పెట్టినా జనం పోటెత్తేవారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో ఆయన నామినేషన్ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివచ్చారు. అలాంటి నామినేషన్ ఇండియాలో ఇంత వరకు జరగలేదని పలువురు చెబుతూ ఉంటారు.
తన సభలకు జనం రావడాన్ని పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో రాజకీయ నాయకులతో పోరాడే జర్నలిస్ట్ పాత్రలో పవన్ నటించారు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్ పిలుపుతో లక్షలాది మంది కదిలివస్తారు. అయితే సినిమాల వరకు అలాంటిది సాధ్యం కానీ.. నిజజీవితంలో అన్ని లక్షల మంది వస్తారా అని అంతా తనను అడిగేవారని పవన్ తెలిపారు. కానీ ఇలాంటి ఫీట్ కేవలం పవన్ కళ్యాణ్ జీవితంలోనే జరుగుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











