35000 చెట్ల నరికివేత.. ఆ పార్టీ పర్యావరణ విద్వంసంపై పవన్ కల్యాణ్ షాకింగ్ ఆదేశం

మానవాళి మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి ప్రకృతి వనరులను రక్షించాలన్నది పెద్దల మాట. భారతీయ వేదాలు, పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయి. వృక్షాలను దేవతలుగా పూజించి.. ఆదరించే సాంప్రదాయం మనది. భారతీయుల ఇతిహాసం రామాయణంలో అడుగడుగునా వృక్షాలు, వనమూలికలు, ఆయుర్వేదం, సంజీవని పర్వతం వంటి వర్ణనలు కనిపిస్తాయి. వేల సంవత్సరాలు జీవిస్తూ ఎంతోదూరం, నిరంతరం ఆక్సిజన్‌ను అందించే శక్తి ఈ వృక్షరాజాలకు ఉంది.

తినే తిండి, ధరించే దుస్తులు, వ్యాధులకు వేసుకునే మందులన్నీ వీటి పుణ్యమే. మొక్కలు, వృక్షాలు నశిస్తే భవిష్యత్తు తరాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. మొక్కలు, చెట్లు లేని ప్రపంచం ఎలా కనిపిస్తుంది.. వీటిని ఎలా కోల్పోతున్నామనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది. వృక్షో రక్షతి రక్షిత: అన్న వేదసూక్తి వెనుక ఉన్న ఇంతటి గొప్పతనాన్ని అందరూ అర్ధం చేసుకుని ఆ మేరకు మొక్కలు, చెట్ల పెంపకంతో ప్రకృతి రక్షణకు పూనుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

AP Dy cm pawan kalyan sensational ordered to remove conocarpus plants

పర్యావరణానికి, ప్రకృతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు చాలా అరుదు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. సినిమాలు, షూటింగ్స్, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా.. ఆయన ప్రవృత్తుల్లో వ్యవసాయం చేయడం కూడా ఒకటి. ఏమాత్రం తీరిక దొరికినా హైదరాబాద్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో గడపటం పవన్‌కు ఎంతో ఇష్టం. అక్కడ పశువుల పెంపకం, పండ్లు, కూరగాయలు సాగుచేస్తున్నారు. రసాయనాలతో కూడిన సాగు పద్ధతులు ఏనాటికైనా చేటు చేస్తాయని నమ్మే పవన్ .. ప్రకృతి ఉద్యమాన్ని ప్రొత్సహించాలని చెబుతుంటారు. విజయ్‌రామ్‌ అనే వ్యక్తితో కలిసి ప్రకృతి ఉద్యమానికి మద్ధతుగా పనిచేశారు.

తన ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించారు పవన్. ఆ పార్టీ మూల సిద్ధాంతాల్లో ప్రకృతి, పర్యావరణం కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందరూ ఆయన హోంమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ పవన్ అనూహ్యంగా గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్, శాస్త్ర, సాంకేతిక శాఖలతో పాటు తనకు ఎంతో ఇష్టమైన అటవీ , పర్యావరణ శాఖలను స్వీకరించారు.

పర్యావరణ సంబంధిత విషయాలపై పవన్ కళ్యాణ్‌కున్న అవగాహనను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. అధికారులతో సమావేశం నిర్వహించిన పవన్.. మడ అడవుల రక్షణ, విస్తీర్ణం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపూ సమీక్షించారు. మడ అడవులను విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సమయంలో ఏకంగా 35000 చెట్ల నరికివేతకు పవన్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపింది. అదేంటీ పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే డౌట్ అందరికీ వస్తుంది.

AP Dy cm pawan kalyan sensational ordered to remove conocarpus plants

కోనో కార్పస్ (ఏడాకుల) చెట్లు అని పిలిచే ఈ వృక్షాలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పవన్ తెలిపారు. గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని, అయితే వీటి వల్ల ప్రమాదమని తెలిసి తీసివేసినట్లు చెప్పారు. ఏడాకుల చెట్ల సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరుగుతాయి. నర్సరీలు, రోడ్లపైనే వీటిని పెంచుతారు. చూడటానికి అందంగా కనిపిస్తున్నాయి కదా అని వీటిని పెంచడం చాలా ప్రమాదమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ మొక్కల కారణంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అదొక్కటే కాదు.. దాదాపు 80 మీటర్ల వరకూ చొచ్చుకెళ్లే ఈ చెట్టు వేళ్లు భూమిలోని నీటిని కూడా తాగేస్తుందని పవన్ హెచ్చరించారు. అందుకే వీటి కొట్టివేతకు ఆయన ఆదేశాలిచ్చారు. ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటిన చెట్లుగా సమాచారం. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X