పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు.. ఏపీ డిప్యూటీ సీఎం జాతకంపై జ్యోతిష్యులు ఏం చెప్పారంటే?
ఇన్నాళ్ల విపక్ష నేతగా ఉద్యమాలు, పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడిగానూ తన మార్క్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు తనకు ఎంతో ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను స్వీకరించి తన ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్ధుల సంఖ్య ఎక్కువ. ఎంత సంయమనం పాటించినా టార్గెట్ చేసే వ్యక్తులు, పొంచి వుండే ముప్పులు ఎక్కువ.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అడ్డుగోడగా నిలబడి.. జగన్‌కు 11 మంది ఎమ్మెల్యేలే దక్కడానికి పవన్ కళ్యాణే కారణమని ఆ పార్టీకి చెందిన కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి బాగోతాలను తవ్వి తీయాలని భావించడం కూడా కొందరికి ఆగ్రహం కల్పించిందని జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఎన్డీయేలో కీలక నేతగా ఉండటంతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి మద్ధతుదారుడు కావడంతో పవన్‌ను మావోయిస్టులు, కొన్ని రకాల శక్తులు టార్గెట్ చేశాయన్న వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే పవన్‌ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి, వీటి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో పవన్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్‌ను నిత్యం వందలాది మంది కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఆయన వస్తున్నారంటే చాలు రోడ్లు కిక్కిరిసిపోతాయి. వీరిలో ఎవరు నిజమైన అభిమానులో, అభిమానం ముసుగులో ఉన్న సంఘ విద్రోహ శక్తులో గుర్తించడం కష్టం. నిఘా హెచ్చరికల నేపథ్యంలో పవన్ భద్రతపై ఆయన ఫ్యాన్స్, జనసేన కేడర్ భయాందోళనలకు గురవుతోంది. ఇలాంటి పవన్ కళ్యాణ్ జాతకంలోని గ్రహగతులపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్ట్లా .

ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేనరని జయశంకర్ తెలిపారు. భద్రత విషయంలో పవన్ చాలా జాగ్రత్తగా ఉంటారని, వంగవీటి మోహన రంగా లాగా రోడ్డుపైకొచ్చి నిరాహారదీక్ష చేయరని చెప్పారు. లడ్డూలాగా పవన్ దొరకడని, ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరని జయశంకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలిచ్చేవారు ఉన్నారని, జనాలకు మంచి చేయాలని తపించే అలాంటి నాయకుడిని కాపాడుకోవాలని సూచించారు. అభిమానం అంటే సినిమా రిలీజ్ సమయంలో పోస్టర్లు అతికించి , చొక్కాలు చించుకోవడం కాదని పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడటమే నిజమైన అభిమానమని జయశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











