విజయ సాయి రెడ్డికి బండ్ల గణేష్ మాస్ కౌంటర్.. ఇన్నాళ్ళకి రివెంజ్
గత కొన్నేళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు అలాగే సినిమాలు కూడా కలిపే ఏ రకంగా కొనసాగుతున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా చాలా మంది స్టార్స్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో సినిమాకి అలాగే రాజకీయాలకి దూరం మరింత తగ్గుతూ వస్తుంది. ఇదిలా ఉండగా సినీ రంగానికి చెందిన పలువురు నిర్మాతలు అలాగే హీరోలు లాంటి వారు రాజకీయాల్లో కొంచెం పెద్ద తలల తోనే వైరం పెట్టుకున్న వారు కూడా లేకపోలేరు.
కాగా అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకెత్తు అయితే తన వీరాభిమాని అలాగే తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఒకరని చెప్పాలి. కాగా బండ్ల గణేష్ తెలంగాణా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఆ మధ్య చేసిన ప్రచారాలు అలాగే కామెంట్స్ కూడా మంచి వైరల్ గా మారాయి. అయితే ఏపీ విషయానికి వస్తే తన బాస్ పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైనా మాట అంటే బండ్ల గణేష్ పడనిచ్చింది లేదు.

ఇలా తన తోటి ఇండస్ట్రీ నటి రోజా సెల్వమణి తోనే పెద్ద యుద్ధం చేసిన వ్యక్తి బండ్ల గణేష్. కాగా బండ్ల గణేష్ కి అలాగే ఏపీలో ప్రముఖ పార్టీ వైసీపీ ప్రధాన నాయకుల్లో ఒకరైన విజయసాయి రెడ్డి నడుమ కూడా కొన్నాళ్ల కితం పెద్ద ఎత్తునే వైరం నడిచింది. మెయిన్ గా ఇద్దరూ కూడా కులాల విషయంలో సోషల్ మీడియాలో మామూలు యుద్ధం చేయలేదు.
కాగా అది అప్పట్లో అలా సర్దుమణిగింది కానీ ఇపుడు బండ్ల గణేష్ టైం వచ్చింది అని చెప్పాలి. తాజాగా విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ ఊహించని విధంగా ఒక పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. మరి దీనికి బండ్ల గణేష్ ఇచ్చిన మాస్ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని చెప్పాలి.
మరి విజయసాయి రెడ్డి పెట్టిన పోస్ట్ కి గాను బండ్ల గణేష్ "అధికారం ఉన్నపుడు అనుభవించి కష్టాల్లో ఉన్నపుడు వదిలేయడం, వదిలేసి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయ్యిపోయింది, ఇది ధర్మమా?" అంటూ బండ్ల గణేష్ ఊహించని కౌంటర్ ఇచ్చారు. దీనితో చాలా రోజుల తర్వాత తన నుంచి వచ్చిన ఈ పొలిటికల్ కౌంటర్ వైరల్ గా మారింది.
ఎలాగో విజయసాయి రెడ్డి రాజకీయాలు వదిలేసా అని చెప్పడం జరిగింది. సో దీనికి మళ్ళీ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ లేదనే చెప్పుకోవాలి. మొత్తానికి అయితే బండ్ల గణేష్ పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ రిప్లైతో వచ్చారని చెప్పాలి. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ తన బిజినెస్ లలోనే బిజీగా ఉండగా తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాని మాత్రం ఎప్పుడో లాక్ చేసుకున్నారు. మరి ఈ అవైటెడ్ కలయిక మళ్ళీ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications











