కమ్మవాడే కాబోయే అమెరికా అధ్యక్షుడు.. భవిష్యత్ చెబుతూ ఊగిపోయిన బండ్ల గణేష్!

ఓ సాధారణ కమెడియన్‌గా, హీరోల ప్రక్కన అసిస్టెంట్‌గా చిన్న చిన్న వేషాలు వేస్తూ.. తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల బడ్జెట్‌తో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి బడా స్టార్స్‌తో సినిమాలు తీసే రేంజ్‌కి వెళ్లాడు బండ్ల గణేష్. ఎంత వేగంగా టాప్ పొజిషన్‌లోకి వచ్చాడో, అంతే వేగంగా పరిశ్రమకు దూరమయ్యాడు. సినిమాల్లో నటించకపోగా, నిర్మాణం కూడా ఆపేశాడు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి బండ్ల బినామీ అనే పుకార్లు సైతం వినిపించాయి. దీనికి తోడు కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఎన్నో వివాదాలు . అయినప్పటికీ నేనింతే అన్నట్లుగా ముందుకెళ్తున్నాడు బండ్ల గణేష్.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్.. యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతున్నాడు బండ్ల గణేష్. తొలి నుంచి రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో ఆ వైపు అడుగుపెట్టారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున బండ్ల గణేష్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోవడంతో కొంతకాలం మౌనం దాల్చారు. 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌కు ఊపు ఉండటంతో ఆ పార్టీకి మద్ధతుగా ప్రచారం చేశారు. తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బండ్ల గణేష్‌కు ఏదో ఒక పదవి దక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

bandla ganesh predicted Kamma Caste representive will USA President at kamma global federation meeting at Hyderabad

ఇక మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన గణేష్.. వేదికలపై మైక్ అందుకున్నారంటే చాలు భజన మామూలుగా ఉండదు. మనోడి ఓవరాక్షన్ కారణంగా కొన్ని ఈవెంట్లకు పిలవడం లేదని ఇండస్ట్రీ టాక్. రాజకీయాలతో పాటు సమకాలీన అంశాలపై స్పందిస్తూ బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా కులం అనే సోషల్ ఎలిమెంట్స్‌ని బండ్ల గణేష్ టచ్ చేశారు.

మాదాపూర్‌లోని నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్‌‌లో పాల్గొన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ.. '' భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అవుతాడు .. బోరులో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మ వాడు. కమ్మ వాడికి మోసం, అన్యాయం చేయటం రాదు.. కమ్మ వాడికి కష్ట పడటం ఒకటే వచ్చు. కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తాం.. కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకొని సాయం చేయండి.. అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుంది ''.

'' రవి అస్తమించని ప్రతిదేశంలో కమ్మ వాడు జెండా ఎగరేస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు.. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు.. ఆకాశం వైపు కసిగా చూసేవాడు.. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వాడు కమ్మ వాడు. కమ్మొడు అంటే కష్టపడే వాడు.. కమ్మొడు అంటే కసితో బతికే వాడు.. కమ్మొడు అంటే కడుపులో ఉన్నది తీసి పెట్టే వాడు.. కమ్మొడు అంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు '' అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే నెటిజన్లు మాత్రం బండ్లపై మండిపడుతున్నారు. సొంత కులం మీద అభిమానం ఉండొచ్చు కానీ.. ఓ పరిధికి మించి చెప్పుకోవడం సరికాదని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి మాటల వల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు హితవు పలుకుతున్నారు. మరి ఈ వివాదంపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X