ఆ వివాదంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. బండ్ల గణేష్ ప్టేట్ ఫిరాయింపు?
సినీ పరిశ్రమల్లో ఏమో కానీ అటు నార్త్ లో చూసుకున్నా ఇటు సౌత్ లో చూసుకున్నా సరే పొలిటికల్ అంశాలకి బాగా దగ్గర ఉండే అంశాల్లో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే ఎక్కువ హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా టాలీవుడ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి సంబంధించి కూడా అనేక మంది సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యి కనిపిస్తారు.
కాగా ఇందులో కూడా సినిమా వాళ్లే అయినప్పటికీ ఓకే పార్టీలో కాకుండా పలు పార్టీల్లో విరివిగా విస్తరించారు. కాగా కొందరు సినీ స్టార్ హీరోలు పార్టీ ఉన్నప్పటికీ వారికి అత్యంత సన్నహితులు సైతం ఇతర పార్టీ లలో ఉన్నారు. కాగా ఇలాంటి కీలక వ్యక్తుల్లో నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. కాగా బండ్ల గణేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలుసు.

కానీ తాను మాత్రం ఆ పార్టీలో లేరు ఇంట్రెస్టింగ్ గా పవన్ ఏ పార్టీకి వ్యతిరేకంగా పెట్టారో అదే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచీ ఉన్నారు. స్టేట్ లో రేవంత్ రెడ్డి సెంట్రల్ లో రాహుల్ గాంధీ ఇదే మాట ఎప్పుడూ కూడా బండ్ల గణేష్ మీడియా ముందుకి వచ్చిన ప్రతీ సారి పాడేవారు. కాగా నరనరాల్లో కాంగ్రెస్ ని నింపుకున్న బండ్ల గణేష్ లో ఇపుడు స్వరం మారడం అనేది షాకింగ్ గా మారింది.
బండ్ల గణేష్ ఎంతటి కాంగ్రెస్ వాదీ అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకి కూడా బాగా తెలుసు. మరి ఇన్నేళ్లు తనకి కాంగ్రెస్ లో సరైన చోటు కూడా ఇవ్వకపోయినప్పటికీ సపోర్ట్ గానే మాట్లాడ్డం జరిగింది. కాగా ఇపుడు తన నుంచి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాటలు వినిపించడం అనేది పవన్ అభిమానులకి సైతం సోషల్ మీడియాలో ఆశ్చర్యకరంగా మారింది. కాగా ఇపుడు హైదరాబాద్ లో ఒక యూనివర్సిటీ విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏకంగా 400 ఎకరాల పచ్చని అడవులని అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం నరికివేస్తుండడం సంచలనంగా మారింది. కాగా దీనిపై సెన్సేషనల్ దర్శకుడు కల్కి 2898 ఎడి దర్శకుడు నాగ్ అశ్విన్ ముందుగా మాట్లాడ్డం అనేది తెలుగు సినిమా ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ సోషల్ మీడియా వారు బన్నీ పుష్ప 2 కాంట్రవర్సీ తీసుకొచ్చి పోస్ట్ చేయగా దీనికి బండ్ల గణేష్ ఇచ్చిన ట్విస్ట్ వైరల్ గా మారింది.
"పనిచేసిన వారిని కాకుండా పార్టీ కోసం కష్టపడి వారని కాకుండా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు కదా మరి దానికి మనం ఏం సమాధానం చెప్పాలి సార్." అంటూ సమాధానం ఇవ్వడం అనేది ఒక్కసారిగా నెటిజన్స్ కి షాకిచ్చింది. దీనితో బండ్ల గణేష్ నెమ్మదిగా ప్లేట్ మార్చేస్తున్నారా? కాంగ్రెస్ కి దూరం అవుతున్నారా? అనే మాటలు మొదలయ్యాయి. మరి బండ్ల గణేష్ ఎందుకు సడెన్ గా ఇలా మాట్లాడుతున్నారో అనేది ఇపుడు చర్చకి దారి తీసింది.


Click it and Unblock the Notifications











