పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ దళపతి పాలిటిక్స్.. కీలక డెసిషన్ తీసుకున్నాడా..?
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన హీరోలు లేదా నటీనటులు ఇపుడు మరింత అవుతున్నారని చెప్పవచ్చు. కాగా ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూ వస్తుంది కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పార్టీ పెట్టి నడిపిస్తున్న హీరోలు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను రాజకీయాలు స్టార్ట్ చేసిన ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఇపుడు ఒక గౌరవప్రదమైన పదవి అలాగే పలు శాఖల మంత్రిగా కూడా పని చేస్తూ ఏపీ రాజకీయాలు సహా జాతీయ స్థాయి పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే పాలిటిక్స్ పరంగా పవన్ పై చాలానే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పొత్తులు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ చాలానే వినిపిస్తూ ఉంటాయి. కాగా ఏదైనా కూడా తాను తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఇపుడు చారిత్రాత్మికంగా నిలిచాయి అని చెప్పవచ్చు. అయితే పవన్ తర్వాత తన రేంజ్ స్టార్డం ఉన్న బిగ్గెస్ట్ హీరోస్ చాలా మంది పార్టీలు పెట్టారు కానీ కొందరు దిగ్గజాలు వెనక్కు కూడా వెళ్లిపోయారు.

కానీ వారి తర్వాత రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ నటుడే విజయ్ దళపతి.. విజయ్ కి తమిళ నాట ఎలాంటి ఆదరణ ఉంటుందో తన సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు ఏ రీతిలో వస్తాయి అనేది అందరికీ తెలిసిందే. ఓ రకంగా ఇపుడు తమిళ్ లో అయితే రజినీకాంత్ కి సమానంగా మార్కెట్ ని తాను సొంతం చేసుకున్నాడు. అలాంటి పీక్ లో రాజకీయాల్లోకి వచ్చేసాడు.
మరి ఇది కూడా దగ్గరదగ్గరగా పవన్ కళ్యాణ్ నిర్ణయానికి దగ్గరగానే అనిపించింది. కాగా ఇదే కాకుండా తన ఆలోచనా ధోరణి కూడా పవన్ తరహాలోనే తన మీటింగ్ గాని తన మీటింగ్ కి వచ్చిన భారీ జన సందోహం గాని చాలా అంశాలు పవన్ తో విజయ్ కి సూట్ అయ్యాయి. అయితే నేషనల్ మీడియా కూడా పవన్ నుంచి విజయ్ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అంటూ తన పార్టీ సభ పెట్టిన మర్నాడే చెప్పుకొచ్చారు.
మరి ఇపుడు నిజంగా తమిళ నాట విజయ్ బిగ్ డెసిషన్ అది కూడా పవన్ తరహాలోనే తీసుకున్నట్టుగా తమిళ నాట సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఎలా అయితే పొత్తు పెట్టుకొని కొన్ని సీట్స్ తీసుకొని ఏపీకి ముఖ్యమంత్రి తర్వాత హోదా ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఇపుడు విజయ్ కూడా ఇదే బాటలో వెళుతున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఆ మధ్య విజయ్ అలయన్స్ పట్ల సుముఖంగానే ఉన్నాడని గవర్నర్ తమిళసై చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ గా ఇపుడు ఈ తరహాలోనే అక్కడ రాజకీయాలు మారుతున్నాయట. విజయ్ తమిళనాట చరిత్ర ఉన్న ఏఐఎండీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చే 2026 ఎన్నికల్లో పోటీ చేసే సన్నాహాల్లో ఉన్నారని అక్కడి రాజకీయ సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా విజయ్ ఈ అలయన్స్ లో భాగంగా తన పార్టీకి 60 సీట్లు సహా డిప్యూటీ సీఎం పదవిని కోరుతున్నాడట. దీనితో విజయ్ కూడా పవన్ బాటలోనే వెళుతునట్టుగా ఇపుడు మరింత క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. పవన్ కంటే సీట్ షేర్ ఎక్కువ కావచ్చు కానీ డిప్యూటీ సీఎం అనే మాట మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా ఇపుడు మారింది.
ఒకవేళ ఇది నిజం అయితే ఇద్దరు బిగ్గెస్ట్ అండ్ టాప్ హీరోస్ రెండు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని చెప్పాలి. మరి ఇది ఫ్యాన్స్ కి కూడా ఓ రేంజ్ కిక్ ఇచ్చే వార్తే అని చెప్పొచ్చు. మరి నిజంగానే విజయ్ దళపతి ఈ బిగ్ డెసిషన్ తీసుకున్నాడా లేదా అనేది మాత్రం ఇపుడు అధికారికంగా బయటకి రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











