హిందూ ద్రోహి.. నీ బతుకు ఏమౌతుందో తెలుసా? రాజమౌళిపై బీజేపీ నేత ధ్వజం

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ సినిమాకు కథ, మాటల సహకారాన్ని దేవకట్టా అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా తమ్మిరాజు, ఫైట్స్ కింగ్ సాల్మన్, సినిమాటోగ్రఫిని ఎస్ గోపాల్ రెడ్డి, పీఎస్ వినోద్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈవెంట్ కోసం చేసిన ఏర్పాట్లు తెలుగు సినిమా పరిశ్రమలో గుర్తుంచుకొనే విధంగా చేశారు.

BJP Leader Chikoti Praveen fires on SS Rajamouli

అయితే ఈ వేడుకలో రాజమౌళి చేసిన ప్రసంగంపై హిందుత్వ వాదులు, అలాగే ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని రాజమౌళిపై పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత చికోటీ ప్రవీణ్ సంచలన రీతిలో వ్యాఖ్యలు చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే?

వారణాసి ఈవెంట్‌‌లో రాజమౌళి మాట్లాడుతూ.. దేవుడి మీద నమ్మకం లేదు. నాన్నగారు వచ్చి ఈవెంట్ సవ్యంగా నడువడానికి హనుమంతుడు వెనుక ఉంటారని చెప్పాడు. కానీ ఈవెంట్ సవ్యంగా సాగలేదు. హనుమపై నాకు కోపం వచ్చింది. ఇలాగేనా నడిపించేది అనిపించింది. మా ఆవిడకు హనుమంతుడంటే చాలా ఇష్టం. ఆయనతో మాట్లాడుతుంటుంది. ఫ్రెండ్‌లా బిహేవ్ చేస్తుంటుంది. ఈ సందర్భంలో మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది. ఏంటి నీ దేవుడు ఇదేనా చేసేది అని కోపం వచ్చింది అని రాజమౌళి అన్నారు.

రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. రాజమౌళి నీవు తీసిన సినిమాలను హిందువులు చూడకపోతే ఏమౌతుందో తెలుసు కదా. మీకు హిందూ దేవుళ్లపై నమ్మకం లేకపోతే నాస్తిక కుక్కలతోనే తీయాలి. మీ సినిమాను నాస్తిక కుక్కలే మూవీని చూడటానికి అనుమతి ఇవ్వాలి. దేవుడిని నమ్మకపోతే ప్రతీ సినిమాకు ముందు ఎందుకు పూజలు చేస్తున్నావు అని ప్రశ్నించారు.

చికోటి ప్రవీణ్ పరుష పదజాలం ఉపయోగిస్తూ.. బిడ్డా రాజమౌళి.. హిందూ సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేకపోతే నీవు ద్రోహిగా మిగిలిపోతావు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. హిందుత్వ వాదుల మనోభావాలను దెబ్బ తీసేలా చేశావు. ఇది నీకు సరికాదు అనే విధంగా చికోటి ప్రవీణ్ వీడియోను రిలీజ్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారణాసి సినిమా గ్లింప్స్‌లో హీరో మహేష్ బాబును శంకర భాగవానుడి వాహనం నందిపై కూర్చొబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందుత్వ వాదులు రాజమౌళిపై కేసు నమోదు చేశారు. అలాగే బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో ఇంద్రుడితో బాహుబలి యుద్ధం చేస్తున్నట్టు చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చ ేశారని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు చేసింది.

More from Filmibeat

Read more about: ss rajamouli Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X