ఇదేం దిక్కుమాలిన లాజిక్‌.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్..

Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'పుష్ప 2' రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఎవరూ ఊహించని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు చేశారు. కాగా.. ఈ అరెస్టు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

పుష్ప సినిమా విడుదల రోజున ప్రీమియర్స్ లో సంధ్య 70 ఎం ఎం థియేటర్ దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఓ పిల్లవాడు గాయపడ్డారు. ఈ విషయంలో బాధిత కుటుంబం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయగా కంప్లీట్ నమోదైంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. థియేటర్‌ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

BRS leader KTR slams Allu Arjun s arrest blames Congress government

తాజాగా అల్లు అర్జున్ ని తన నివాసంలో అరెస్టు చేసి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ తీసుకొని నమోదు చేశారు. ఆ తరువాత వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పతికు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పాలకుల ఆభద్రతకు పరాకాష్ట అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశాడు.' జాతీయ అవార్డు గెలుపొందిన స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పాలకుల అభద్రత కు ప్రతికష్ట. తోకిసలాటలో బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ, ఈ ఘటనలో నిజమైన వైపల్యం ఎవరిది? అసలు ఈ ఘటనతో నేరుగా సంబంధం లేని అల్లు అర్జున్ ని కామన్ క్రిమినల్ చూడటం సరికాదు. నేనెప్పుడూ మనం గౌరవంగా మర్యాదగా ప్రవర్తించాలి. ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న.. హైడ్రా భయంతో హైదరాబాదులో ఇద్దరు అమాయకులు చనిపోయారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన లాజిక్ ప్రకారం.. ఆ మరణాలకు బాధ్యులుగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి' కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.

BRS leader KTR slams Allu Arjun s arrest blames Congress government

మరోవైపు.. అల్లు అర్జున్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సోమవారం వరకు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ ఈ పిటిషన్ వేశారు. ఈ అరెస్టును బన్నీ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరికొందరు చట్టం ముందు అందరూ సమానులే అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. త్వరలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ చేయాల్సిందే

More from Filmibeat

Read more about: ktr allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X