నోరు జారిన మల్లారెడ్డి.. హీరోయిన్‌పై అలాంటి కామెంట్స్, ఏకీపారేస్తోన్న నెటిజన్లు

మనసులో ఏమున్నా దానిని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్టైల్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మల్లారెడ్డికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. పూలు అమ్మినా, పాలు అమ్మినా , కష్టపడ్డా అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ . దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వైరల్ అవుతుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మల్లన్నను అంతా ఇష్టపడతారు. అయితే ముక్కుసూటితనంతో మల్లారెడ్డి పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా మరోసారి ఆయన నోరుజారి ఇబ్బందుల్లో పడ్డారు.

స్వయంకృషితో వ్యాపారవేత్తగా, విద్యాసంస్ధల అధినేతగా ఎదిగారు మల్లారెడ్డి. డిగ్రీని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌లో పలు విద్యాసంస్ధలను స్థాపించారు. ఆయన సంస్థల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్ధులు దేశ , విదేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లారెడ్డి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. తొలి ప్రయత్నంలోనే ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పడిన ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఏకైక టీడీపీ ఎంపీగా మల్లారెడ్డి రికార్డుల్లోకెక్కారు.

brs mla malla reddy remarks on Actress Kasi Kapoor at Love Your Father Movie pre release event

రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేసి 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. 2023లో మరోసారి మేడ్చల్ నుంచి గెలిచినప్పటికీ .. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు మల్లారెడ్డి. సినీ పరిశ్రమతో తొలి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో తన ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా సినీ ప్రముఖులను ఆహ్వానిస్తుంటారు మల్లారెడ్డి. అలాగే ఆయన విద్యాసంస్ధల్లో ఎన్నో సినిమాల షూటింగ్‌లు జరిగాయి.

తాజాగా లైఫ్ (లవ్ యువర్ ఫాదర్ ) అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి మైక్ అందుకుని అందరినీ ఉత్సాహపరిచారు. హీరో శ్రీహర్ష మా కాలేజీలోనే చదువుకున్నారని.. అతని తండ్రి మా కాలేజీ ప్రిన్సిపాల్ అని వీరు సినిమాను నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు. లైఫ్ సినిమాను పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని.. లైఫ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు.

అక్కడితో ఆగితే ఆయన మల్లారెడ్డి ఎందుకవుతారు. హీరో శ్రీహర్ష తమిళ హీరో విజయ్ కంటే కూడా స్మార్ట్‌గా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి పేరు కసి కపూర్ అంట.. ఆమె చాలా కసి కసి కసిగా ఉందని మల్లారెడ్డి కామెంట్ చేశారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నా.. హీరోయిన్ కాస్త ఇబ్బంది పడినట్లుగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు మల్లారెడ్డిపై మండిపడుతున్నారు. కూతురు వయసున్న అమ్మాయి పట్ల ఇలాంటి మాటలు సరికాదని, ప్రజాప్రతినిధిగా ఉండి ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.

More from Filmibeat

Read more about: malla reddy brs tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X