Unstoppable 4: రాజమండ్రి జైలులో పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే? బాలయ్య ముందు చంద్రబాబు కంటతడి

ఇండియాలో టాప్ రేటింగ్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) సీజన్ 4 గ్రాండ్‌గా మొదలైంది. ఈ సీజన్ ఆరంభానికి ముందు వచ్చిన ప్రోమో కంటెంట్ భారీగా బజ్ క్రియేట్ చేయడంతో తొలి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సీజన్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో అక్టోబర్ 25వ తేదీన స్ట్రీమింగ్ చేశారు. తొలి ఎపిసోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంచుకొన్న విషయాల్లోకి వెళితే..

హోస్ట్ నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో వేదికపైకి వచ్చి తన అనుభవాలను, అభిమానుల దీవెనల చెప్పుకొంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన సినిమాలకు సంబంధించిన కథల గురించిన నీతిని చక్కగా వివరిస్తూ.. చక్కగా చమత్కరిస్తూ.. తండ్రి చూపిన స్పూర్తిని చెప్పుకొంటూ.. ప్రేక్షకులకు తన రీతిలో వినోదాన్ని పంచారు. దాంతో సీజన్ అత్యంత సందడిగా మారింది.

Chandrababu Naidu Reveals conversation with Pawan Kalyan in Rajahmundry Jail in Balakrishna s Unstoppable 4 Season

అన్‌స్టాపబుల్ 4 సీజన్‌లోకి చంద్రబాబు నాయుడిని ఘనంగా ఆహ్వనిస్తూ వేదిక మీదకు పిలిచారు. వేదికపై రాగానే కుశల ప్రశ్నలతోపాటు చిలిపి ప్రశ్నలు కూడా వేశారు. అయితే బాలయ్య చిలిపితనానికి ధీటుగా బాబు కూడా అదే తరహాలో ఎదురు ప్రశ్నలు వేయడం ఈ షోకు క్రేజీగా మారింది. ఆద్యంతం భావోద్వేగాలు, సరదాగా ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా చంద్రబాబు వెల్లడించిన విషయాల నేపథ్యంలో ఆడియెన్స్ కంటతడి పెట్టుకోవడం కనిపించింది.

అయితే చంద్రబాబు నాయుడిని గత ప్రభుత్వం అరెస్ట్ చేయడమనే అంశం ఈ ఎపిసోడ్‌కు హైలెట్ అయింది. వైఎస్ జగన్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డాడు. ఆయన తండ్రితో సుదీర్ఘమైన పోరాటం సాగింది. అయితే ఏనాడు మా మధ్య ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. ఏదైనా ఉన్నా సిద్దాంతపరమైన విభేదాలకే రాజకీయ పరిమితమైంది. అంతేగానీ.. ఇలా అడ్డదారిలో అరెస్ట్ చేయడం దారుణం అని చంద్రబాబు అన్నారు.

చట్ట నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయకుండా అమరావతికి తీసుకొచ్చారు. రోజంతా విచారణ పేరుతో వేధించారు. అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ తనకు సంఘీభావం తెలియజేయడానికి వస్తే అడ్డుకొన్నారు. ఆయన అలా రోడ్డుపైనే నిరసన తెలియజేయడం అందరికి తెలిసిందే. అయితే ఆ రాత్రి నేను తప్పు చేయలేదు కాబట్టి.. అధైర్య పడకూడదు. చావుకు భయపడితే అనుకొన్నది సాధించలేము అని చంద్రబాబు అన్నారు.

జైలులో నన్ను కలువడానికి పవన్ కల్యాణ్, మీరు, లోకేష్ వచ్చారు. అయితే కొద్ది సేపు మేమిద్దరం మాట్లాడుకొన్నాం. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ధైర్యంగా ఉన్నారా? సార్ అని అడిగాడు. మీరు అధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మనమంతా కలువాల్సిన అవకాశం వచ్చిందని అన్నాడు. అక్కడే ఆ ఆలోచనతో విజయానికి తొలి మెట్టు పడింది. ఎలాంటి షరతులు లేకుండా పొత్తుకు పొద్దు పొడిచింది. జైలు నుంచి బయటకు వచ్చి.. బీజేపీని సంప్రదించకుండానే పొత్తును ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X