రోజా పరిస్ధితి దారుణంగా.. వైఎస్ జగన్ వేటు పడటం ఖాయమేనా? తెర వెనుక భారతీ
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అయ్యాయనే సామెత ఒకప్పటి స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి విషయంలో అక్షరాలా నిజమైంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె నిత్యం వార్తల్లో నిలిచేవారు. అప్పటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లతో పాటు టీడీపీ నేతలపై రోజా విరుచుకుపడేవారు. పై నుంచి ఫుల్ సపోర్ట్ ఉండటం, పైగా పవర్ మనదే అన్న ధీమాతో రోజా నోటికి అడ్డూ అదుపూ ఉండేది కాదు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేకపోవడంతో ఆమె బయట కనిపించడం లేదు.
ఈ ఐదేళ్లు టీడీపీ కూటమిని ఎలా ఎదుర్కోవాలో రోజాకు పాలు పోవడం లేదు. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్‌ను అమలు చేస్తుండటంతో ఒకరి వెంట మరొక వైసీపీ నేత జైలుకు వెళ్తున్నారు. ఈ లిస్ట్‌లో రోజా కూడా ఖచ్చితంగా ఉన్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవకతవకలతో పాటు విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలోనూ రోజా హస్తం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె తీసుకున్న నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సమీక్షిస్తే రోజాకు తిప్పలు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పోనీ తన పూర్వాశ్రమమైన సినీ పరిశ్రమలో తిరిగి అడుగుపెడదామంటే అక్కడా బోల్డెంత నెగిటివిటీ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలపై రోజా చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగా, నందమూరి కుటుంబాలను కాదని నిర్మాతలు, దర్శకులు రోజాకు అవకాశమిస్తారా అన్నది అనుమానమే. టాలీవుడ్‌లో ఛాన్స్ లేకపోతేనేం .. మనకు కోలీవుడ్‌లోనూ ఫాలోయింగ్ ఉందిగా, పైగా తన భర్త సెల్వమణి అక్కడ స్టార్ డైరెక్టర్ కాబట్టి తిరుగులేదనుకుంటే పొరపాటే.
ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలకు విజయవాడ వచ్చిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ .. చంద్రబాబు, ఎన్టీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే నాడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు ఆ మాటలు నచ్చలేదు. అంతే.. రజనీకాంత్‌పై ఇష్టమొచ్చిన కామెంట్లు చేశారు. వీరిలో రోజా కూడా ఉన్నారు. దీంతో చెన్నైలోనూ రోజాకు అంత ఈజీగా అవకాశం దొరకదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్ధితుల నేపథ్యంలో సినీ, రాజకీయ జీవితాలకు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా అంటూ చర్చ జరుగుతోంది.

ఇదిలాఉండగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు రోజా స్థాయిలో కౌంటరిచ్చేందుకు వైసీపీలో జనాలు కనిపించడం లేదు. గతంలో జగన్ కోసం గొంతు చించుకున్న నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుండటమో, లేదంటే సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడమో జరుగుతోంది. తప్పనిసరి పరిస్ధితుల్లో జగన్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. రోజాలా వాగ్ధాటి, కౌంటర్ ఇవ్వగలిగిన మహిళా నేత కోసం జగన్ అన్వేషిస్తున్నారట.
తన సతీమణి వైఎస్ భారతీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారట.. ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలోనే లాంచింగ్ కార్యక్రమం జరుగుతుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మహిళా నాయకురాలిగా.. కూటమిలో ఉన్న మహిళా నేతలకు భారతీతో కౌంటర్ ఇప్పిస్తారనే టాక్ నడుస్తోంది. అటు దూకుడుతో ఉన్న సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు చెక్ పెట్టడానికి భారతీనే అస్త్రంగా ప్రయోగించాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











