పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం వేళ.. మోదీ నా చెవిలో ఏం చెప్పారంటే? చిరంజీవి ఎమోషనల్
టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న అగ్ర హీరోస్ లో పాలిటిక్స్ లోకి కూడా వచ్చి సక్సెస్ అయ్యిన వారిలో చాలా తక్కువమందే కనిపిస్తారు అని చెప్పాలి. మెయిన్ గా సొంతంగా ఒక పార్టీ కూడా పెట్టి సస్టైన్ అయ్యిన వారిలో మాత్రం అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కనిపిస్తారని చెప్పవచ్చు.
కాగా అప్పట్లోలా ఇపుడు కూడా పరిస్థితులు ఉంటే పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ గా ముందే పెద్ద సక్సెస్ వచ్చి ఉండొచ్చు ఏమో కానీ పవన్ రాజకీయాల్లో సక్సెస్ సాధించడానికి సుమారు పదేళ్లు పట్టింది. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ ఫెయిల్యూర్ తర్వాత దానికి మరో వెర్షన్ గా పవన్ తన జనసేన పార్టీ స్థాపించినట్టుగా తాను తెలిపారు.

కాగా అన్నయ్యతో అప్పుడు విభేదించినప్పటికీ తన కొట్టిన పొలిటికల్ విజయాన్ని యావత్తు దేశమే తిరిగి చూసేలా చేసిన విజయాన్ని ఇలా గెలిచిన వెంటనే తీసుకెళ్లి అన్నయ్య కాళ్ళ దగ్గర పెట్టడం అనేది మెగా అభిమానుల జీవితంలో ఒక మరపు రాని క్షణం అని చెప్పవచ్చు. ఒకింత అది అభిమానులకి కూడా ఎంతో ఎమోషనల్ మూమెంట్ కూడా.. కాగా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులకి కిక్ మీద కిక్ ఇస్తూనే వస్తున్నారు.
మెయిన్ గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజున అయితే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి చేతిని ఒక చేతిలో పవన్ కళ్యాణ్ చేతిని ఒక చేతిలో పెట్టుకొని అందరికీ అభివాదం తెలిపిన మూమెంట్ అయితే ఒక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఇది అయితే చాలా మంది ఫ్రేమ్ కూడా కట్టించుకున్నారు.
కాగా అసలు అక్కడ ఏం జరిగింది. ఆ భారీ సభలో ఇద్దరు అన్న తమ్ముళ్ల దగ్గర మోడీ ఏం చెప్పారో అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఇపుడు ఈ అంశాన్ని మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేశారు. కాగా మెగాస్టార్ కి రీసెంట్ గానే యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ అఛీవ్మెంట్ అవార్డు ఒకటి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మీట్ లో చిరంజీవి అసలు మోడీ తనకి ఏం చెప్పారో తెలిపారు. ఆనాడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజున మోడీ ఇలా చెప్పారట.
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఆ గెలుపు మీ పాదాల దగ్గర పెట్టడం, ప్రమాణ స్వీకారం రోజు మీ ఇద్దరి ఆప్యాయత చూసి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని మోడీ చెప్పారట. అంతే కాకుండా అన్నాతమ్ముల ప్రేమాభిమానాలు అంటే ఇలా ఉంటాయి అని యావత్తు భారతదేశానికి మీరు ఇద్దరు చాటి చెప్పారు అని మోడీ ఆరోజు చెప్పినట్టుగా మెగాస్టార్ అసలు విషయాన్ని రివీల్ చేశారు. దీనితో మెగాస్టార్ తాలూకా ఈ పవర్ఫుల్ కామెంట్స్ ఇపుడు మెగా అభిమానుల్లో మరింత వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











