చిరంజీవి సినిమా వల్లే హోం శాఖ తీసుకోలేదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గూస్ బంప్స్ స్టేట్మెంట్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్నినాళ్ళు చెరగని ముద్ర వేసుకున్న హీరోస్ గా నిలిచిన వారిలో తప్పకుండా కొన్ని పేర్లు మిగిలిపోతే వారిలో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా తప్పకుండ ఉంటారు. మరి ఎన్నో ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవి చూడని హిట్ లేదు ప్లాప్ లేదు. ఇప్పుడుకి కూడా వయస్సుతో సంబంధం లేకుండా తాను హీరోగా స్టార్ట్ అయ్యిన తరం నుంచి ఇప్పుడు హీరోలుగా వస్తున్నా వారి వరకు గట్టి కాంపిటేషన్ ఇస్తున్న ఏకైక హీరోగా మెగాస్టార్ ఒకే ఒక్కడిగా నిలిచారు.
కాగా కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అనే పేరు నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయిన తన సినీ ప్రస్థానంలో తనని మించిన ఆదరణ అందుకుంది మాత్రం తన బ్లడ్ బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. సినిమాల పరంగా అన్నయ్య విరామం తీసుకున్న సమయంలో పవన్ ఆ లోటుని భర్తీ చేసాడు. అలాగే పొలిటికల్ పరంగా కూడా పవన్ పలు ఆటుపోట్ల తర్వాత తన పూర్తి విజయాన్ని తీసుకొచ్చి అన్నయ్య కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు.

మరి ఇలా అన్నయ్య అంటే ఎంతో ప్రేమ, గౌరవం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవి అలాగే మరింత ముఖ్యమైన పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాగా చాలా మంది పవన్ కళ్యాణ్ హోమ్ మినిష్టర్ పదవి తీసుకుంటాడు అని అనుకుంటే ట్విస్ట్ ఇస్తూ పవన్ పంచాయతీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా పర్యావరణాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
కానీ అసలు పవన్ హోమ్ శాఖని ఎందుకు వదులుకున్నాడో ఇప్పుడు చేసిన ఒక గూస్ బంప్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. తాను హోమ్ మినిష్టర్ పదవి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అన్నయ్య చిరంజీవి చేసిన "రుద్రవీణ" సినిమా అంటూ పవన్ తెలిపారు. ఆ సినిమా నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని, ఎన్నో కష్టాలు ఉన్న చిన్న ఊరిలో ఒక సర్పంచ్ తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడు.

ఒక దేశమే అతని వైపు చూసేలా చేయగలిగే శక్తి సర్పంచ్ కి ఉంటుంది అని ఆలా తీసిన "రుద్రవీణ" కారణంగా గ్రామాలని అభివృద్ధి చేస్తే దేశం ముందుకు వెళుతుంది అని అందుకే తాను హోమ్ మినిస్ట్రీ కాకుండా ఈ పంచాయతీరాజ్ శాఖని తీసుకున్నాను అని పవన్ కామెంట్స్ చేశారు. మామూలుగానే పవన్ కి ప్రజాసేవ అంటే ఎంత పిచ్చి అనేది తన అభిమానులకి, తన నుంచి సాయం పొందినవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో సక్సెస్ అయితే మరింతమంది జీవితాలు బాగుపడతాయి అని చాలా మంది భావించారు. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ ఆలోచనా ధోరణిలో తన అన్నయ్య "రుద్రవీణ" సినిమా ఇంతటి ముఖ్య పాత్ర పోషించింది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చని చెప్పాలి. ఇది విన్న మెగా అభిమానులు అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు


Click it and Unblock the Notifications











