బ్రేకింగ్: వైసీపీలో వికెట్ ఔట్.. వైఎస్ జగన్ పార్టీకి ఆలీ రాజీనామా.. కారణం ఏమిటంటే?
కమెడియన్, నటుడు, నిర్మాత ఆలీ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. ఏపీలో దారుణమైన పరాజయం తర్వాత ఆలీ ఆ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అదే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, అలాగే బాలకృష్ణ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నిక కావడంతో సినీ పరిశ్రమ అంతా ఏపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండటం ఇష్టం లేక తన సన్నిహితులతో చర్చించిన అనంతరం తన రాజీనామా లేఖను వైఎస్ జగన్‌కు పంపినట్టు తెలుస్తున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆలీ అత్యంత ఆప్తుడు. అలాంటి ఆయనను విభేదించి రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. రెండేళ్ల పదవి కాలంలో ఆయన ఉన్నారు. తాజాగా పార్టీ ఓటమి నేపథ్యంలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్టు తెలిసింది.
అయితే భవిష్యత్‌లో రాజకీయాల జోలికి వెళ్లదలచుకోలేదు. ఇక నుంచి సినిమాలపైనే, అలాగే సినీ జీవితంపై దృష్టిపెడుతానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.

కమెడియన్ ఆలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా నటుడిగా, కమెడియన్‌గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన సుమారు 1000 కిపైగా సినిమాల్లో నటించారు. ఆయనకు ఇటీవలే గౌరవ డాక్టరేట్ లభించింది.


Click it and Unblock the Notifications











