‘ఆ హోటల్ 820 రూమ్‌లో హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి.. కేటీఆర్ ఏం చేశావో బయటపెట్టాలా?’

తెలుగు రాష్ట్రాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతున్నది. దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణంగా భావిస్తున్న ఈ వివాదాస్పద అంశం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కదిపేస్తున్నది. అయితే ఈ వివాదంలో గతంలో తెలంగాణలో అధికారాన్ని కొనసాగించిన పార్టీ కీలక నేత, పార్టీ వర్గాలు ప్రమేయం ఉండటం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంతో జోక్యం ఉన్న వ్యక్తులను, అధికారులను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం విచారిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఒకరు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేయడం ఈ వివాదంలో హైలెట్‌గా మారింది. కాంగ్రెస్ నేత చేసిన కీలక వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం అత్యంత వివాదాస్పద అంశంగా మారిన టాపిక్ టెలిఫోన్ ట్యాపింగ్. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, పోలీస్ వర్గాలను విదేశాల నుంచి రప్పించి విచారణను వేగవంతం చేశారు. గత రెండేళ్లుగా చర్చనీయాంశమవుతున్న ఈ వివాదం తాజాగా ఒక్కసారిగా రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నది.

Telephone Tapping

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు అధికారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారిస్తున్నది. ఈ విచారణలో తెలంగాణలోని దాదాపు అన్ని ప్రతిపక్ష నేతల ఫోన్లను, అలాగే సినీ, బిజినెస్, మీడియా వర్గాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. దాదాపు 40 వేల మంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఓ వార్త ప్రధాన టెలివిజన్ ఛానెల్స్‌ కథనాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం గాంధీ భవన్‌లో జరిగిన ఇటీవల జరిగిన మీడియా మీట్‌లో కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ హీరోయిన్‌ను కేటీఆర్ 2015 సంవత్సరంలో బెదిరించి పార్క్ హయత్‌ హోటల్‌‌కు రప్పించుకొని ఏం చేశావో నాకు తెలుసు. దానికి సంబంధించిన వీడియో నా వద్ద ఉంది. ఆ హీరోయిన్ ప్రతిష్టకు భంగం వాటిల్లకూడదని ఆమె పేరు నేను బయట పెట్టదలుచుకోలేదు. ఆమెను హోటల్‌లోని 820 రూమ్‌కు పిలిపించుకోలేదా? అని ఆరోపణలు చేశారు.

మంత్రి హోదాలో హీరోయిన్‌ను ఏం చేశావో తెలుసా? ఆ రోజు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది? కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిని బెదిరించి లొంగదీసుకొన్నావు. ఆ వీడియో మా వద్ద ఉంది. ఆమెను ఎలా బ్లాక్ మెయిల్ చేసి పిలుపించుకొన్నావో తెలుసు. ఆ హీరోయిన్‌ను హోటల్‌కు ఓ ఎమ్మెల్యే తీసుకొచ్చింది నిజం కాదా? ఆ ఎమ్మెల్యే తన కారులో స్వయంగా నీ రూమ్‌‌లో వదిలిపెట్టింది నిజం కాదా? మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని హీరోయిన్లను ఏం చేశావో నాకు తెలుసు. 2018, 2021లో హీరోయిన్లతో ఏం చేశావో మాకు తెలుసు? అని గజ్జెల కాంతం ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

Take a Poll

సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత విషయాలను దొంగచాటుగా విన్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇంకా పలువురు యాంకర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ.. మావోయిస్టులు, అసాంఘీక శక్తులకు సంబంధించిన కొందరి ఫోన్లను బహుశా ట్యాప్ చేసి ఉంటారేమో అని అన్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: congress ktr tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X