వైఎస్ జగన్ ఆఫీస్ నుంచి కథంతా.. ముంబై నటి వేధింపులపై.. సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు
తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జెత్వానీ వేధింపుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారుతున్నది. బాధిత నటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్ర మాత్రమే కాదు.. ఈ కుట్ర వెనుక పెద్ద మోసం ఉంది. నాకు జరిగిన అన్యాయం, నా కుటుంబాన్ని వేధించిన తీరు పట్ల చంద్రబాబు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ముంబై నటి వ్యవహరంపై సీపీఐ అగ్ర నేత నారాయణ ఘాటుగా స్పందిస్తూ..
కాదంబరీ జెత్వానీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. విద్యాసాగర్‌తోపాటు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులు నాపై కుట్రపన్నీ కేసులో ఇరికించారు. నాపై భూటకపు కేసు, అన్యాయంగా హానీ గ్రాఫ్ ఆరోపణలు చేస్తున్నారు. నాపై ఎలాంటి హానీ ట్రాప్ కేసులు లేవు. సోషల్ మీడియాలో వీరికి సబంధించిన కుక్కలు అనవసరం మొరుగుతున్నాయి అని అన్నారు.

నన్ను 15 రోజులపాటు గెస్ట్ హౌస్‌లో బంధించారు. ఇంకా కొన్ని రోజులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో విచారించారు. 40 రోజులపాటు కేసు పెట్టి జైలుకు పంపించారు. నా కుటుంబాన్ని, నన్ను చాలా దారుణంగా ట్రీట్ చేశారు. ప్రస్తుతం 70 ఏళ్ల నా తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది అని అన్నారు.
ఇదిలా ఉండగా, సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బాంబేలో ఉన్న సినిమా యాక్టర్ కాదంబరి జెత్వానీ కేసు సంచలనం రేపింది. కాదంబరి ఉదంతం వింటే.. భయం వేస్తున్నది. ఈ నటిపై ప్రైవేట్ ఆఫీస్ నుంచి ఏదైనా కుట్ర చేస్తే పెద్దగా చర్చ ఉండేది కాదు. ఏకంగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి కథ అంతా నడించింది అని నారాయణ ఆరోపించారు.
జెత్వానీపై అక్రమ కేసుల వ్యవహారం వైఎస్ జగన్ కార్యాలయం నుంచే జరగడం ఆశ్చర్యం కలుగుతున్నది. ఈ కేసులో ఇంత జరుగుతున్నా.. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మరింత ఆశ్చర్యంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. నాకు సంబంధం ఉంది అనో.. నాకు సంబంధం లేదు అనో చెప్పలేకపోతున్నాడు. అలా స్పందించకపోగా నోర్మూసుకొని లండన్‌కు వెళ్లిపోతున్నాడు అని నారాయణ అన్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఏపీకి చెందిన 15 మందికి పైగా లగ్జరీ వాహనంలో వచ్చి ముంబై నుంచి మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మమ్మల్ని ముంబై నుంచి తీసుకు రావడంలో క్రాంతి రాణా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విశాల్ గున్యా ఈ మిషన్‌ను అమలు చేశాడు. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఈ కుట్రలో ఉన్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. అయితే వారి పాత్ర ఎంత వరకు ఉందనే విషయం దర్యాప్తులో తేలుతుంది అని అన్నారు. ప్రభుత్వ దర్యాప్తులోనే రాజకీయ కుట్ర ఉందా? అనేది తేలుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











