అటు రాజకీయంగా..ఇటు టాలీవుడ్ లో.. చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్
ఒక్క తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు మొత్తం సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఒక రేంజ్ లో చెప్పుకున్న సందర్భాలు ఇన్నేళ్ళలో కోకొల్లలు అని చెప్పాలి. అసలు ఒక టైం లో అయితే ఫాలోయింగ్ కానీ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ విషయంలో కానీ సౌత్ లో రజినీకాంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే అనే లెవెల్ హైట్స్ ని పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చూసేసారు.
ఏ హీరోకి అయినా హిట్ పడే కొద్దీ ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం భిన్నం. ప్లాప్ పడే కొద్దీ పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ వచ్చింది. అలా ఎన్నో ప్లాప్ లు తర్వాత హిట్ కొడితే ఇండస్ట్రీ షేక్ అయ్యింది. కాగా ఇలా సినిమాల్లో మళ్ళీ పీక్ లోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ సినిమాలు రాజకీయాలు ఒకటి కాదు అంటారు.

దీనితో అక్కడ కూడా సుమారు పవన్ కళ్యాణ్ కి ఎదురు దెబ్బలు తప్పలేదు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్లు అయితే పవన్ ని సినిమా పరంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు. అయినా కూడా పవన్ ఎక్కడా బెరికింది లేదు. సై అంటే సై అన్నట్టుగా "మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే మూడు సినిమాలు వస్తే మూడు సినిమాలకి ఏపీలో జరిగిన రచ్చ అందరికీ తెలుసు.
విఆర్వో, పోలీసులు ఆఖరికి మంత్రులు కూడా పవన్ సినిమాలకి అడ్డంకులుగా మారారు. స్పెషల్ షోస్ లేవు, దారుణమైన టికెట్ ధరలు, వింత రూల్స్, పైగా ఆ రూల్స్ లేని సినిమాలకి కూడా ఇష్టమొచ్చిన ధరలు వీటితో నిర్మాతలకి భారీ నష్టాలు ఏపీలో వచ్చాయి. దీనితో పవన్ కూడా చాలా సందర్భాల్లో ఆ ప్రభుత్వం వల్ల ఇండస్ట్రీ ఎంతలా చితికిపోయిందో తన సినిమాలకి నష్టాలు వస్తే తాను డబ్బులు వెనక్కి ఇచ్చానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇదంతా అప్పుడు. కానీ ఇప్పుడు విధి ఎంత వింతగా నాటకం ఆడింది అంటే అప్పుడు ఇబ్బందులు ప్రభుత్వం మారాడడానికి పవన్ కళ్యాణే ముఖ్య పాత్ర పోషించడం ఒకెత్తు అయితే ఇప్పుడు ఇదే టాలీవుడ్ నుంచి సినీ దిగ్గజ నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు, నాగవంశీ తదితర ముఖ్య నిర్మాతలు అంతా తమ హీరో కం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు వెళుతున్నారు.
తనతో తాము గత ప్రభుత్వం మూలాన ఎదుర్కొన్న ఇబ్బందులు. టికెట్ ధరల హైక్ లు, థియేటర్స్ సమస్యలు కోసం చర్చించనున్నారట. ఇది అసలు కర్మ సిద్ధాంతానికి చక్కటి ఉదాహరణగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ లైఫ్ స్టోరీలో కూడా ఒక ఎలివేషన్ థింగ్ లా కూడా దీన్ని గట్టిగా చెప్పొచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే టైం విషయంలో పవన్ కళ్యాణ్ "బ్రో" అనే సినిమా చేయగా అందులో కాలం ఎంత విలువైనది పరిస్థితులు ఎలా మారుస్తుంది అనేది కూడా చెప్పడం అద్భుతమైన యాదృచ్చికం.


Click it and Unblock the Notifications











