పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తాం.. నా టార్గెట్ అదే.. అంబటి రాయుడు సంచలన కామెంట్స్!

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చాలా మంది తెలుగు హీరోలు ఏ రేంజ్ లో అదరగొడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం ఆ పాన్ ఇండియా హీరోస్ ని మించిన క్రేజ్ మాత్రం కేవలం ఒకరిద్దరికి మాత్రమే సొంతం. కాగా ఆ ఒకరిద్దరిలో తప్పకుండా ఉండే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

కాగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి భారీ ఫాలోయింగ్ సొంతం. తన పేరిట ఎన్నెన్నో రికార్డులు తెలుగు స్టేట్స్ లో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు ప్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కానీ మార్కెట్ కానీ తగ్గలేదు. కాగా ఇవి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ లో తన ప్రవర్తన చూసి కూడా అభిమానులు అయ్యిన వారు ఉన్నారు.

Cricketer Ambati Rayudu says We will make pawan kalyan as Cheif Minister of Andhra Pradesh

కాగా వీటితోనే పవన్ పాలిటిక్స్ లోకి కూడా అడుగు పెట్టగా అక్కడా తనకి ఎదురు దెబ్బలు తప్పలేదు. మరి అవన్నీ తట్టుకొని ఇపుడు ఆంధ్ర రాష్ట్రంలో రెండో అతి పెద్ద పొలిటికల్ పవర్ గా పవన్ అవతరించారు. కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ పై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా రీసెంట్ గానే అంబటి రాయుడు టాలీవుడ్ స్టార్స్, దర్శకుడు సుకుమార్ పై కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇపుడు పవన్ కళ్యాణ్ విషయంలో అంబటి రాయుడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఐడియాలజీపై షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. తన దృష్టిలో పవన్ పెట్టిన పార్టీ ఒక పార్టీ కాదు అంటున్నాడు. అది పార్టీ కాదు ఒక పొలిటికల్ మూమెంట్ అంటూ వ్యాఖ్యానించాడు.

Take a Poll

అలాగే పవన్ కళ్యాణ్ అన్ని సామాజికవర్గాల వారు కూడా రాజ్యాధికారం అవసరం హక్కు అని భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ ఐడియాలజీని చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఆయన నాకు గొప్ప ఇన్స్పిరేషన్ అని తెలిపారు. అలాగే తనని కలిసి మాట్లాడినపుడు తన ఐడియాలజీ చాలా గొప్పదని తెలుసుకున్నాను అని తెలిపారు. అలాగే పొత్తులు విషయంలో కూడా అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మనం ఏ పార్టీతో ఉన్నాం అనేది ముఖ్యం కాదు మన ఐడియాలజీని ఎలా ముందు తీసుకెళుతున్నాం అనేదే ముఖ్యం పవన్ కూడా అదే చేస్తున్నారు అని తెలిపాడు. ఇక దీనితో పాటుగా కళ్యాణ్ గారిని డెఫినెట్ గా సీఎం ని చేసేందుకు నేను కష్టపడి తీరుతాను అని ఆయనకి సీఎం అవ్వాలనే కోరిక లేకపోయినప్పటికీ ఆయన్ని సీఎం చేసేందుకు నేను డెఫినెట్ గా చేయాల్సింది చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ ని చేయడం ఇపుడు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ నడుమ ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

కాగా గతంలో అంబటి రాయుడు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఉన్న వారి ఐడియాలజీకి తనకి వర్కౌట్ కాక బయటకి వచ్చేసాను అని ఆ తర్వాత పవన్ పార్టీ జనసేనలో తాను చేరిన సంగతి అందరికీ తెలిసిందే. మరి వచ్చే ఎన్నికల్లో రాయుడుకి పవన్ ఏదన్నా కీలక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X