టీడీపీకి డిప్యూటీ సీఎం.. పవన్ పై తెలుగు తమ్ముళ్ళ ఫైర్

నిర్మొహమాటంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా ఇంపాక్ట్ చూపించే రాజకీయ నాయకుల్లో మెయిన్ గా సినీ రంగం నుంచి వచ్చిన వారిలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు మొదటి వరుసలో ఉంటారని చెప్పాలి. కాగా పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

అప్పుడు వరకు తెలుగు రాష్ట్రాల్లో రెండే ప్రధాన పార్టీలు, ఇద్దరు బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు అనే సమయంలో ప్రత్న్యమ్యాయంగా వచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్. అంతకు మునుపు తన అన్నయ్య కూడా రాజకీయాల్లోకి వచ్చారు కానీ తాను మధ్యలోనే విరమించారు. ఇక పవన్ పార్టీ పెట్టడంతోనే 2014లో రాజకీయాలు ఒక పార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే తాను మరో పార్టీకి మద్దతు ఇచ్చి 2014లో ఊహించని విధంగా ఏపీ రాజకీయాలు తాను తిప్పేశారు.

deputy cm pawan kalyan controversial comments make tdp fans crazy

ఈ తర్వాత చాలానే మార్పులు జరిగాయి. ఏపీలో టీడీపీ గెలిచేందుకు పవన్ మద్దతు ఇస్తే దానిని మర్చిపోయి అప్పుడులో చాలా మంది తెలుగు తమ్ముళ్లు అలాగే సోషల్ మీడియాలో కూడా అనేకమంది పవన్ విషయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక 2019లో పవన్ సింగిల్ గా చేసేసరికి టీడీపీకి భారీ దెబ్బ తగిలి ఓట్లు చీలిపోవడంతో పవన్ పార్టీ ఓటమి ఏమో కానీ తెలుగు దేశం పార్టీ దాదాపు భూస్థాపితం అనే మాట వినిపించింది.

ఇక 2024 ఎన్నికలకి ముందు చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ ఇచ్చిన మద్దతుతో మళ్ళీ టీడీపీకి ఊపిరి దక్కింది. కాగా ఇదే మాటని పవన్ కళ్యాణ్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో చెప్పడం అనేది సంచలనంగా మారిపోయింది. ఇక ఈ కామెంట్స్ తో సోషల్ మీడియాలో మళ్ళీ పవన్ పై చాలా మంది తెలుగు తమ్ముళ్లు విషం కక్కుతున్నారు.

ఇంట్రెస్టింగ్ గా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు పవన్ పై విమర్శలు చేస్తుండడం విశేషం. పవన్ తాము టీడీపీకి ఊపిరి పోసాం అని చెబితే సోషల్ మీడియాలో మాత్రం రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గెలిపించింది చంద్రబాబు అంటూ వారంతా పవన్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

అయితే ఇన్నాళ్లు కొంచెం ప్రశాంతంగా ఉంది అనుకుంటే పవన్ నుంచి ఈ ఊహించని కామెంట్స్ మాత్రం చాలా మందిని ఎక్కడో కెలికేసినట్టు అయ్యిందని చెప్పక తప్పదు. ఇదే మీటింగ్ లో పవన్ నుంచి తాము టీడీపీకి చెయ్యందించాము అని చెప్పడం జరిగింది బ్యాలెన్సింగ్ గా చంద్రబాబు, లోకేష్ లని కూడా పవన్ పొగడడం అనేది ఇంకొందరికి కనెక్ట్ అయ్యింది.

ఇలా మొత్తానికి మాత్రం డిప్యూటీ సీఎం కామెంట్స్ మాత్రం ఇపుడు ఊహించని లెవెల్లో కాక రేపుతున్నాయి. ఇక ఇవి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజి మరియు మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు అనే మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X