వైఎస్ జగన్ పాలనలో అవమానాలు, చేదు అనుభవాలు.. పవన్ హయాంలో రాజసంగా స్వాగతం!

సినీ నటుడు, పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల కళ్లలో ఆనందం తాండవిస్తున్నది. ప్రతీ విభాగానికి చెందిన నిపుణులు, నేతలు, నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు అందరూ హర్షం ప్రకటిస్తూ.. తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయనే విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేస్తున్నారు. గత పాలనలో చేదు అనుభవాలను తుడిపేసుకొంటూ కొత్త బాటలు వేసేందుకు నిర్మాతలు జూన్ 24వ తేదీన జనసేనానిని కలిశారు. ఆ వివరాల్లోకి వెళితే..

గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో సినీ పరిశ్రమ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఓ పక్క కరోనా పరిస్థితుల కారణంగా కుదేల్ అయిన ఇండస్ట్రీని ఆదుకోవడం పక్కన పెడితే.. వేధింపులకు గురిచేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వారి పాలనలో అనేక ఇబ్బందులు, సమస్యలకు సినీ పరిశ్రమ గురైంది. టికెట్ రేట్లు చాలా నాసిరకంగా, అతి తక్కువ ధరకు కోట్ చేసింది ఆ ప్రభుత్వం. పోలీసులను, అధికారులను ఉసిగొల్పి.. కొన్ని చోట్ల థియేటర్లను సీజ్ కూడా చేసింది.

Deputy CM Pawan Kalyan met Telugu film Industry producers in Auspicious environment at Vijayawada

ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ పరిస్థితులను వివరించడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఓ టీమ్ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసింది. అయితే ఆ సమయంలో చేతులు జోడించి వేడుకొన్న చిరంజీవి.. విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది. అగ్ర హీరోలందరూ కూడా చేసిన వినతులను బుట్టదాఖలు చేయడంతో ఇండస్ట్రీ మరింత ఇబ్బందుల్లో పడింది.

ప్రస్తుతం అనేక సమస్యలతో ఉన్న ఇండస్ట్రీకి సహకారం అందించాలనే వినతులతో మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్టు సమాచారం.

Deputy CM Pawan Kalyan met Telugu film Industry producers in Auspicious environment at Vijayawada

పవన్ కల్యాణ్‌తో జరిగిన సమావేశంలో నిర్మాతలతోపాటు ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను వివరించగా, పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ సమావేశం అత్యంత సదృద్బావం వాతావరణంలో జరిగినట్టు సమాచారం. ప్రతీ విషయాన్ని, అలాగే ఇప్పటికే తన దృష్టిలో ఉన్న సమస్యలను నిర్మాతలతో పవన్ కల్యాణ్ పంచుకొన్నట్టు తెలుస్తున్నది.

Deputy CM Pawan Kalyan met Telugu film Industry producers in Auspicious environment at Vijayawada

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, సీ అశ్వినీదత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య , శ్రీమతి సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ , నాగవంశీ, టిజి విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X