ఏ దిక్కూ లేక వైఎస్ జగన్ పంచన.. ఆ అమ్మాయికి రోజూ టార్చరే , స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
వైసీపీ అధినేత , ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సినీ పరిశ్రమకు గట్టి మద్ధతుదారులలో యాంకర్ శ్యామల ఒకరు. తొలి నుంచి వైఎస్ కుటుంబం పక్షాన నిలిచే శ్యామల .. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఆమె సేవలను గుర్తించిన జగన్ తాజాగా శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఆ హోదాలో నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఈ హాట్ బ్యూటీ . ఈ క్రమంలో ఆమెపై మండిపడ్డారు డైరెక్టర్ గీతా కృష్ణ.
తన షోలు, సినిమా ఈవెంట్లు, సినిమాల్లో చిన్నాచితకా ఈవెంట్లతో మంచి పాపులారిటీ సంపాదించారు శ్యామల. మిగిలిన యాంకర్ల మాదిరిగా క్లీవేజ్ షో చేయకుండా సాంప్రదాయబద్ధంగా చీరకట్టులోనే కనిపించేవారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయినా శ్యామల అందం కొంచెం కూడా తగ్గలేదు. తన భర్త నరసింహారెడ్డి వైసీపీకి మద్ధతుదారు కావడంతో ఆమె కూడా జగన్, షర్మిల పాదయాత్రలలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వైసీపీ తరపున ప్రచారం చేసిన శ్యామల.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు . తీరా ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అన్నా అంటూ శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్ .. పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను మారుస్తున్నారు. దీనిలో భాగంగా కొత్తగా నలుగురిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించగా వారిలో శ్యామల ఒకరు.
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలపై నిత్యం ప్రెస్‌మీట్‌లు పెడుతూ తనలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తున్నారు శ్యామల. తనపై ట్రోలింగ్ జరుగుతున్నా ఆమె లెక్కచేయడం లేదు. ఎంతగా తొక్కినా సరే తాను నిలబడతానని శ్యామల తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో శ్యామలపై మండిపడ్డారు సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. శ్యామల చాలా అందంగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసినందుకు బాగా డబ్బులు ముట్టజెప్పారని గీతాకృష్ణ ఆరోపించారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత శ్యామలను ఏకీపారేశారని , ఇండస్ట్రీలో ఉపాధి కూడా లేకుండా పోయిందన్నారు. తన భవిష్యత్ కోసం జగన్‌ను ప్రాధేయపడితే ఆమెకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారని గీతా కృష్ణ ఆరోపించారు. ఇది ఆమెకు రాబోయే రోజుల్లో రిస్క్ తప్పదని .. నాలుగేళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు విచక్షణ ఉండదని భౌతిక దాడులు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
శ్యామలకు కౌంటర్ ఇచ్చేందుకు తీసుకొచ్చిన కడప అమ్మాయి చాలా బాగా మాట్లాడుతోందని, విమర్శించినా తన హద్దుల్లో ఉంటోందని గీతాకృష్ణ తెలిపారు. అధికార ప్రతినిది పదవికి రాజీనామా చేసి వేరే జాబ్ వెతుక్కోవడం మంచిదని శ్యామలకు ఆయన హితవు పలికారు. ఏపీలో కానీ, హైదరాబాద్‌లో కానీ ఆమెకు ఏ జాబ్ దొరకదని గీతాకృష్ణ జోస్యం చెప్పారు. కూటమి శ్రేణులు అంత తేలిగ్గా శ్యామలను వదలవని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











