బయటపడ్డ రోజా నిజస్వరూపం.. డోంట్ టచ్.. దూరంగా ఉండు అంటూ అవమానించిన నటి
సమాజంలో మనం హాయిగా బతుకుతున్నామంటే అందుకు కొందరు శ్రమజీవుల కష్టమే కారణం. ఇందులో అందరి పాత్రా ఉంది. మన రోడ్లు, వీధులు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయంటే అందుకే పారిశుద్ధ్య కార్మికులే కారణం. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఇప్పటికీ అంటరానివారుగా అవమానాలను ఎదుర్కొంటూ, కొన్ని చోట్ల బహిష్కరించబడుతున్నారు. చాలా మంది పారిశుద్ధ్య కార్మికులు చాలా ప్రమాదకరమైన పరిస్ధితుల్లో పనిచేస్తున్నారు.
మనం ముట్టుకోవడానికే భయపడే చెత్త, ఇతర వ్యర్ధాలను చేతితో పట్టుకోవడమే కాదు.. కంపు కొట్టే డ్రైనేజీలలోకి దిగి వాటిని శుభ్రం చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. వీరి గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టే సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడిగారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో ఒక ముఖ్యమైన భాగమని, వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని మోడీ ప్రపంచానికి ఓ సందేశం పంపారు.

ఇదిలావుండగా.. ఒకప్పుడు దక్షిణాదిలో తిరుగులేని హీరోయిన్‌గా వెలుగొందారు రోజా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి, పట్టుదలతో అగ్రనటిగా ఎదిగారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలోనే దర్శకుడు ఆర్కే సెల్వమణిని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగానూ పనిచేసి ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా.. తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
ఫైర్‌బ్రాండ్‌గా దూకుడుగా ఉండే ఆమెను జగన్ బాగా ప్రొత్సహించారు. ప్రత్యర్ధులపై వాడి వేడి విమర్శలు చేయడంలో రోజా ఎప్పుడూ ముందుంటారు. 2014లో నగరి నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో జగన్ ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా.. వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్న రోజా.. బయట కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో రోజా చేసిన ఒక పనిపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి తన భర్త సెల్వమణితో కలిసి హాజరైన రోజా.. స్వామి వారిని దర్శించుకున్నారు. స్వతహాగా సినీనటి కావడంతో పాటు తమిళనాడులోనూ ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఆలయంలో రోజాను చూసిన కొందరు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. వారందరిని నవ్వుతూ పలకరించిన రోజా.. ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఇంతలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజాతో సెల్ఫీలు దిగాలని భావించి ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చారు. వారిని గమనించిన రోజా దగ్గరకు రావొద్దు, దూరంగా జరిగి నిల్చోవాలంటూ చేతితో సైగలు చేశారు. దీంతో సదరు పారిశుద్ధ్య కార్మికులు దూరంగా ఉండే రోజాతో సెల్ఫీలు దిగారు. మిగితా వారితో రాసుకొని..పూసుకొని సెల్పీలు దిగారు. దాంతో ఆమె తీరును తప్పుపట్టారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. దీంతో మరోసారి నెటిజన్లకు , యాంటీ వైసీపీ వర్గాలకు అడ్డంగా దొరికిపోవడంతో వారు రోజాను చెడుగుడు ఆడుకుంటున్నారు. అసలే విజయసాయిరెడ్డి ఎపిసోడ్‌తో తలబొప్పికడుతుంటే అది చాలదన్నట్లు రోజా కూడా ఓ వివాదాన్ని తెచ్చిపెట్టడంతో వైసీపీ ఇరకాటంలో పడినట్లయ్యింది. మరి ఈ వివాదంపై రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











