జుట్టుకి టీడీపీ, వైసీపీ రంగులేసిన స్టార్ హీరో.. నెటిజన్లు ఊరుకుంటారా? ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో తరుణ్, ఉదయ్ కిరణ్ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు వరుణ్ సందేశ్. కర్లీ హెయిర్, హస్కీ వాయిస్, అందమైన చిరునవ్వుతో చూడటానికి పక్కింటి కుర్రాడిలా కనిపించే వరుణ్.. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించారు. వరుస హిట్లతో యువతలో వరుణ్ సందేశ్ క్రేజ్ పెరిగిపోయింది.. ఇతను స్టార్ హీరో అవ్వడం పక్కా అని క్రిటిక్స్ సైతం భావించారు. కానీ ఏమైందో తెలియదు తర్వాతి రోజుల్లో వరుణ్ చేసిన సినిమాలు ఒకదాని వెనుక మరొకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం వరుణ్ సందేశ్ అనే హీరో ఉంటాడనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మరిచిపోయారు కూడా.

అయితే రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించారు వరుణ్ సందేశ్. తన భార్య వితికా షేరుతో కలిసి అద్భుతంగా పార్టిసిపేట్ చేశాడు. దాదాపు 105 రోజుల పాటు హౌస్‌లోనే గడిపి టైటిల్ రేసులో నిలిచాడు. అయినప్పటికీ ఆయనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో వరుణ్ ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. స్క్రిప్ట్ సహా కొన్ని విషయాల్లో కేర్ తీసుకోకపోవడం, మొహమాటం తన కెరీర్‌ను దెబ్బకొట్టాయని వరుణ్ ఒకానొక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు.

hero Varun Sandesh reacts on trolling over his new hairstyle

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా , నేను హ్యాపీగానే ఉన్నానని.. ఒక మూవీ ఎందుకు ఆడలేదు అనడానికి బోల్డెన్నీ రీజన్స్ ఉంటాయన్నారు. హ్యాపీహ్యాపీగా సినిమా ఎంతోమందికి ఇష్టమని, కానీ ఆ సమయంలో ఆ మూవీ ఆడలేదని వరుణ్ తెలిపారు. హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం హిట్లు కావడంతో తన తదుపరి సినిమాలపై భారీ అంచనాలున్నాయని.. ఆ మైండ్ సెట్‌తో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను తన చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయని వరుణ్ సందేశ్ చెప్పారు.

లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ తిరిగి ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవల 'నింద'లో హీరోగా కనిపించిన ఆయన.. లేటెస్ట్‌గా విరాజిలో నటిస్తున్నారు. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఓ సైడ్ బ్లూ కలర్, మరో సైడ్ పసుపు రంగు వేసిన హెయిర్ స్టైల్‌తో ఆయన హల్‌చల్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఓ విలేకరి మాట్లాడుతూ.. జుట్టుకు ఓ వైపు టీడీపీ, మరోవైపు వైసీపీ రంగులు వేశారని, రాజకీయాలను ఏమైనా టచ్ చేశారా అని ప్రశ్నించారు. దీనికి దర్శకుడు స్పందిస్తూ మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు.

hero Varun Sandesh reacts on trolling over his new hairstyle

అయితే వరుణ్ సందేశ్ హెయిర్ స్టైల్, లుక్‌పై సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ ఆగడం లేదు. దీనికి ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ హెయిర్ స్టైల్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై తన భార్య చాలా బాధపడిందని.. కానీ తాను అవేవి పట్టించుకోనని , చేయాల్సింది చేసుకుంటూ పోతానని వరుణ్ చెప్పారు. హెయిర్ స్టైల్ గురించి దర్శకుడు ముందే చెప్పారని.. జుట్టుకు బ్లూ, యెల్లో కలర్స్ వేసి ఫోటో షూట్ నిర్వహించారని అయితే తనకు విపరీతంగా స్వెట్టింగ్ వస్తుండటంతో రంగులన్నీ ముఖంపై కారిపోయానని తెలిపారు. దీంతో డైరెక్టర్ బాగా టెన్షన్ పడుతున్నారని, ఈలోగా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు పర్మినెంట్ కలర్స్ వాడాలని చెప్పగా ఆయనకు బాగా కోపం వచ్చిందని.. ఇంతలో తానే వెళ్లి ఆ మాట చెప్పడంతో డైరెక్టర్ సంతోషపడ్డారని వరుణ్ సందేశ్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X