Who is Kadambari Jetwani? హిందీ నటికి వైసీపీ నేతకు సంబంధమేమిటి? ఆ పారిశ్రామిక వేత్త ఎవరు?
హిందీ నటిని విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత హింసించి, బెదిరింపులకు గురి చేసి వేధించారు అనే విషయం సోషల్ మీడియాలోను, తెలుగు టెలివిజన్ మీడియాలోను సంచలనం రేపుతున్నది. ముంబైలో ఉండే ఈ తారపై బెజవాడలో కేసు నమోదు కావడం వెనుక అనేక ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితురాలు మౌనంగా ఉండటం.. తెలుగు మీడియాలో రకరకాల కథనాలు వెలుగు చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ కేసు వెనుక మిస్టరీ విషయంలోకి వెళితే..
తెలుగు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. కృష్ణా జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన పారిశ్రామిక వేత్త కుమారుడు ముంబైలోని ఓ పార్టీలో కాదంబరీ జెత్వానీని కలుసుకొన్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆమెను వదిలించేకునే ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆమె సమ్మతించకపోవడంతో వివాదంగా మారింది.

అయితే అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేత సహయంతో తన కుమారుడి ప్రేమ కథకు ముగింపు చెప్పాలనుకొన్నారు. ప్రభుత్వంలోని కీలక నేతతో సంప్రదింపులు జరిపి.. పోలీస్ అధికారితో చేతులు కలిపారు. విజయవాడ పోలీస్ ఆఫీసర్‌తో సుమారుగా 5 కోట్ల మేర డీల్ సెట్ చేశారు అనే మీడియా కథనాల్లో బలంగా వినిపించింది.
విజయవాడకు చెందిన పోలీస్ ఉన్నతాధికారి ముంబైకి తన సిబ్బందితో వెళ్లారు. కాదంబరి జెత్వాన్ని కుటుంబాన్ని బెదిరించి విజయవాడకు తీసుకొచ్చారు. ఓ గెస్ట్ హౌస్‌లో బంధించి చిత్ర హింసలు పెట్టారు. బెదిరింపులకు ఒప్పుకోకపోవడంతో 5 లక్షల చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపారు అనేది తాజా మీడియాలో వెలుగు చూసిన అంశం.
అయితే వైసీపీ నేతలు, పోలీసుల బెదిరింపులకు కాదంబరి జెత్వానీ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు.ఇక చేసేది ఏమీ లేక వారితో రాజీకి వచ్చారు. ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గడంతో బెయిల్ ఇచ్చి ముంబైకి పంపించారనే విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, రెండు రోజులుగా మీడియాలో భారీగా కాదంబరి జెత్వానీపై కథనాలు వస్తున్పప్పటికి.. ఆ నేతలు గానీ, పోలీసులు గానీ స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే వైసీపీ నేత, పోలీస్ ఉన్నత వర్గాలు నుంచి ఖండన రాకపోవడంతో మరింత వివాదంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక కాదంబరి జెత్వానీ విషయానికి వస్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అందాల బొమ్మ ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబైలో స్థిరపడిన ఆమె.. ఓ దర్శకుడి పరిచయంతో సినీ తారగా మారింది. సడ్డా అడ్డా అనే హిందీ చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత క్విజా అనే కన్నడ సినిమాలోను, అలాగే ఆట అనే తెలుగు సినిమాలోను, ఐ లవ్ మీ అనే మలయాళ సినిమా, మరో పంజాబీ సినిమాలో నటించింది.


Click it and Unblock the Notifications











