Roja: రోజాపై తీవ్ర అవినీతి ఆరోపణలు.. 10 లక్షల దుర్వినియోగం.. జబర్దస్త్ టీమ్‌తో చిందులు, విందులు!

సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రోజా అక్రమాలు, అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆమె చేసిన నిధుల దుర్వినియోగం అందర్నీ ముక్కున వేలేసుకొనేలా చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంతా పెట్టుబడిదారులు అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్దంగా ఆమె విలాసవంతమైన జీవితం కనిపిస్తున్నది. ఆటల పేరుతో డబ్బును సొంత జల్సాల కోసం ఖర్చు పెట్టిన తీరుపై రాజకీయ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న రోజా అవినీతి లీలల విషయానికి వస్తే..

అడుకుందాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో మంత్రి రోజా చేపట్టిన కార్యక్రమాన్ని ఆ సమయంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుషారుగా బ్యాట్ పట్టి యువతకు స్పూర్తినిచ్చేలా ముందుకు వచ్చారు. యువ క్రీడాకారులకు కిట్లు, క్రీడా సామాగ్రి అందించే స్కీమ్ అంతా అవినీతి మయంగా మారిందని ప్రస్తుతం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Is Actress Roja Selvamani misuses 10 Lakhs rupees for Adukundam Andhra and CM Cup programme

అయితే జనవరి 1వ తేది అంటే నూతన సంవత్సరం వేడుకల రోజున కొండపల్లిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడాకారులకు సన్మానం పేరుతో రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట. అయితే ఈ వేడుకలో క్రీడాకారులే కనిపించకపోగా.. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులే ఎక్కువగా హాజరయ్యారనేది టాక్. అయితే భారీగా, విలాసవంతమైన ఈ వేడుకలో మంత్రి హోదాలో రోజాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు విందులు చేసుకొని చిందులు వేశారనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం.

అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు క్రీడాకారులు ఎవరు రాకపోగా.. ఎక్కువ మంది జబర్దస్త్ ఆర్టిస్టులే వచ్చారనే విషయంపై మీడియాలో చర్చ జరుగుతున్నది. ఈ వేడుకలో ఆమె బంధువులతో కలిసి జల్సా చేసుకొంటూ వినోదాన్ని ఆస్వాదించారు అనే విషయం బయటకు వచ్చింది.

Is Actress Roja Selvamani misuses 10 Lakhs rupees for Adukundam Andhra and CM Cup programme

రోజా అధికారికంగా పాల్గొన్న కార్యక్రమానికి భారీగా ఖర్చు చేశారు. ఈ వేడుక కోసం సాప్ విభాగం నుంచి సుమారుగా 10 లక్షల రూపాయల వ్యయం అయింది. అంతేకాకుండా ప్రతీ రోజు భవానీ హైలాండ్ నుంచి మూడు పూటల భోజనం సప్లై చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా మారింది.

ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణ ఓటమి పాలైన తర్వాత ఎక్కువగా రోజాను టార్గెట్ చేసుకొనే అవినీతిపరమైన విషయాలు బయటకు వస్తుండటం గమనార్హం. అయితే ఈ విమర్శలు, ఆరోపణలపై రోజా స్పందించి వివరణ ఇస్తారా? అనేది చర్చనీయాంశమవుతున్నది. ఇక రోజా అవినీతి ఆరోపణలపై ఇప్పటికే 100 కోట్ల కుంభకోణం జరిగిందని ఏపీసీఐడీలో కేసు నమోదు కూడా అయిందనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X