జనసేనలోకి అల్లు అరవింద్ ప్రయత్నం.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన , టీడీపీ , బీజేపీ కూటమి ఘన విజయం .. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా , ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ, ఏపీలోనూ.. కేంద్రంలోనూ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తూ ఉండటంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో అల్లు - మెగా కుటుంబాల మధ్య విభేదాలు కూడా అంతేస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగానే ఈ పరిస్ధితులు చోటు చేసుకున్నాయనేది అందరూ అంగీకరించే విషయం . ఎన్నికల్లో సొంత మేనమామ పవన్ కళ్యాణ్‌కు కాకుండా మిత్రుడు , వైసీపీ నేత రవిచంద్ర కిశోర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్లడంతో మెగా , పవన్ అభిమానులకు ఎక్కడో కాలింది. మెగా కాంపౌండ్ కూడా ఈ విషయంలో గుర్రుగానే ఉన్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి చెప్పొచ్చు.

అల్లు అర్జున్, స్నేహా దంపతులను సాయిధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడం, నాగబాబు ట్వీట్ ఇలా ఆ రెండు కుటుంబాల మధ్య మునుపటిలా బాండింగ్ లేదనడానికి ఎన్నో నిదర్శనలు చూపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి పవన్ చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు కానీ, ప్రమాణ స్వీకారం సందర్భంగా గానీ ఎక్కడా అల్లు కుటుంబం కనిపించలేదు. చెప్పను బ్రదర్ ఘటన నుంచి నంద్యాల ప్రచారం వరకు అల్లు అర్జున్ పనులు మెగా ఫ్యాన్స్‌కి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో ఆయన వారి చేతిల్లో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. వీరి దెబ్బకు భయపడే పుష్ప - 2 సినిమా విడుదలను వాయిదా వేశారని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Is Allu aravind tried into pawan Kalyan Janasena Here senior journalist imandi rama rao sensational comments

చిరంజీవి సంగతి ఏమో కానీ, అల్లు అరవింద్‌తో పవన్‌కు రిలేషన్ అంతంత మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన సమయంలో అరవింద్ - పవన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయంటారు. విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్.. అన్నయ్య నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాటు చిరంజీవితో పవన్ మాట్లాడలేదని ఇండస్ట్రీ టాక్. కొందరు నాయకుల వల్లే పీఆర్పీ ప్రస్థానం ముగిసిందని జనసేనాని ఎన్నో వేదికలపై ఆరోపించారు. ప్రజారాజ్యంలో చేరిన కీలక నేతలు పార్టీని వీడిన సందర్భంలో ఎక్కువగా అల్లు అరవింద్‌పైనే ఆరోపణలు చేశారు.

తనను అల్లు అరవింద్ ఓ నటుడిగానే చూశారని, అంతే తప్పించి ఓ సామాజిక సృహ ఉన్న వ్యక్తిగా గుర్తించలేదని పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు తానేం మాట్లాడినా ఎవరు పట్టించుకుంటారని అక్కసు వెళ్లగక్కారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ సినిమా మనిషిగా .. పరిశ్రమ కష్టాలపై అవగాహన ఉండటంతో సినీ ప్రముఖులు బెజవాడ వచ్చి ఆయనను కలిశారు. వీరిలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత తొలిసారిగా పవన్‌ను పబ్లిక్‌గా అరవింద్ కలవడం, ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నా జనంలో ఏదో అనుమానం. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు .. అరవింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Is Allu aravind tried into pawan Kalyan Janasena Here senior journalist imandi rama rao sensational comments

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జనసేనలో చేరతానని అల్లు అరవింద్ నేరుగా పవన్‌తో చెప్పారని వ్యాఖ్యానించారు. మీ వెనుక ఉంటానని, పార్టీకి చేతనైన సాయం చేస్తానని చెప్పగా.. పవన్ కళ్యాణ్ వద్దని వారించారని రామారావు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి ఎవరూ రాజకీయాల్లోకి రారని, బాగా సంపద పెరిగిపోయినప్పుడు దానిని నిలబెట్టుకోవడానికే వస్తారని ఆయన ఆరోపించారు. ఎవరి చేతుల్లో అధికారం ఉందో .. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా వారి ప్రాపకం కోసం అర్ధరాత్రి 12 గంటలకైనా కలవడానికి సిద్ధమన్నట్లుగా తిరుగుతారని ఇమ్మంది రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్‌ను పార్టీలో చేరతానని అరవింద్ ఎప్పుడు అడిగారా అంటూ నెటిజన్లు ఆన్‌లైన్‌లో తెగవెతికేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X