అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ వివాదం.. ఐకాన్ స్టార్‌పై స్పందించిన నాగబాబు
రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర జరిగినటువంటి కొన్ని ఊహించని కాంట్రవర్సీస్ లో బిగ్ కాంట్రవర్సీ మెగా అండ్ అల్లు ఫ్యామిలీ సంబధించే అని అందరికీ తెలుసు. పాన్ ఇండియా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పొలిటికల్ గా చూపించిన కొన్ని ఇంట్రెస్ట్ లు మెగా అండ్ అల్లు కుటుంబాల్లో చిన్న చీలికలు టెహ్చాయి తెచ్చాయి అనేది వాస్తవమే అన్నట్టుగా మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన రీసెంట్ కామెంట్స్ తో కన్ఫర్మ్ అయ్యింది.
అయితే ఈ చీలికలు ఫ్యామిలీ చిన్నగా ఉంటే అభిమానుల్లో మాత్రం చాలా దూరం వెళ్లాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు చాలామంది చిరు చరణ్ లపై నెగిటివ్ పోస్ట్ లు పెడుతూ వస్తున్నారు. ఇలా ఈ రేంజ్ కి వెళ్లిన ఈ కాంట్రవర్సీ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు విషయంలో కూడా కొన్ని అంశాలు ఈ రెండు నెలల్లో వైరల్ గా మారాయి, నాగ బాబు పెట్టిన ఓ పోస్ట్ మళ్ళీ డిలీట్ చేయడం తర్వాత ఇంకేదో వివరణ ఇవ్వడం వంటివి మరింత హీట్ తీసుకొచ్చాయి.

ఇలా అక్కడ నుంచి ఇపుడు వరకు ఈ రెండు కుటుంబాల నడుమ కోల్డ్ వార్ జరుగుతుంది అనే ఒక టాక్ అయితే ఉంది. మరి ఎట్టకేలకి ఈ కోల్డ్ వార్ కి ఎండ్ కార్డు పడినట్టుగానే ఇప్పుడు కొంచెం కొంచెం రివీల్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఇది కూడా నాగబాబు ద్వారానే సెటిల్ అవుతుండడం గమనార్హం. కాగా తాను రీసెంట్ గా సోషల్ మీడియాలో జరిపిన ఇంట్రాక్షన్ లో అల్లు అర్జున్ రిలేటెడ్ ప్రశ్నలు ఎదురయితే వాటికీ స్పందించారు.
'అల్లు అర్జున్ సంగతేంటి బాబాయ్' అంటే.. దానికి రిప్లై గా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తాను బదులిచ్చారు. అలాగే అల్లు అర్జున్ కోసం ఒక మాటలో చెప్పాలి అనే ప్రశ్నకి బాగా కష్టపడతాడు అంటూ స్పందించారు. మరి ఈ ప్రశ్నలకి నాగబాబు కావాలంటే స్కిప్ చేసేయవచ్చు కానీ స్పందించి నార్మల్ గానే సమాధానం చెప్పారు అంటే అన్ని కాంట్రవర్సీలకు ఎండ్ కార్డు వేసినట్టే అని చెప్పుకోవాలి.

మరి ముందు రోజుల్లో మరింత కలివిడి వాతావరణం కనిపిస్తుందో లేదో అనేది వేచి చూడాలి. కాగా ఇపుడు అల్లు అర్జున్ తన సెన్సేషనల్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్ ని చేస్తుండగా ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అలాగే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, అనసూయ భరద్వాజ్ లు నెగిటివ్ పాత్రల్లో కనిపించనున్నారు.
అలాగే వారితో పాటుగా మలయాళ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ నడుమ కొన్ని సన్నివేశాలు మాత్రం పతాక స్థాయిలో ఉండనున్నాయి. కాగా ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ గా మొత్తం 6 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











