సూపర్‌స్టార్‌ను ఢీ కొట్టబోతున్న డిప్యూటీ సీఎం.. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఆ ఇద్దరు!
తమిళనాడు సినీ రంగంలోను, రాజకీయాల్లో నేతలు, సినీ యాక్టర్ల మధ్య విచిత్రమైన పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఎంజీఆర్ నుంచి నేటి వరకు సినీ తారలు, రాజకీయాల మధ్య ఓ రకమైన ఘర్షణ వాతావరణం స్పష్టంగానే ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో తమిళ రాజకీయాలు మరింత రసకందాయంగా ఉంటాయనేది తాజాగా సంఘటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో చాలా గ్యాప్ ఏర్పడింది. తలైవీ మరణం తర్వాత అన్నాడీఎంకే రోజు రోజుకు తన ప్రతిష్టను కోల్పోతున్నది. జయలలిత తర్వాత ఆ స్థాయి ఆకర్షణీ నేత కనిపించకపోవడంతో ఆ పార్టీ కేడర్ నిర్వీర్యం అవుతున్నది. అధికార డీఎంకేకు ఎట్టి పరిస్థితిలో పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కనిపించడం లేదనే రాజకీయ నేతల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే జయలలిత స్పేస్‌ను ఫిల్ చేయడానికి తొలుత రజనీకాంత్ ప్రయత్నించారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తన పార్టీ ఏర్పాటును ఉపసంహరించుకొన్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ పార్టీ స్థాపించి తన ఉనికి చాటుకొనేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆయన సినిమా కెరీర్ ప్రోత్సాహకరంగా ఉండటంతో ఆయన డీఎంకే పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్లోకి సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ ప్రవేశించారు. తన పార్టీని బలపేతం చేయడానికి పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే ఇటివల తన పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. దాంతో ఆయన పార్టీ కార్యకర్తల్లోను, అభిమానుల్లోను ఉత్తేజం, ఉత్సాహాన్ని నింపారు.

అయితే తాజాగా రిలీజైన ది గోట్ సినిమా అన్ని ప్రతికూలతను అధిగమించి భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ నేపథ్యంలో విజయ్‌కు తమిళ రాజకీయాల్లో భారీగా సపోర్టు పెరుగుతున్నట్టు కనిపించింది. దాంతో డీఎంకే తన అనుభవాన్ని రంగరించి.. యువ నేతను పార్టీ ఫేస్‌గా చూపించేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే యువ హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించి.. రాష్ట్రానికి కాబోయే సీఎం అనే సంకేతాలు ఇచ్చింది.
అయితే ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయడం వెనుక భారీ వ్యూహం ఉంది. స్టార్ హీరో విజయ్ పార్టీని సమర్ధంగా ఎదుర్కొనేందుకు, యూత్ ఓట్లను పొందేందుకు సీఎం స్టాలిన్ పథక రచన చేశాడు అనే వాదన తమిళ రాజకీయాల్లో వినిపిస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉదయనిధి స్టాలిన్, విజయ్ మధ్య పొలిటికల్ వార్ క్రియేట్ చేయనున్నాదా? అనే ప్లాన్ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











