బాలీవుడ్ హీరోయిన్‌కు వైసీపీ నేతల చిత్ర హింసలు.. కీలక నేతలు, అధికారల మెడకు బిగుస్తున్న ఉచ్చు!

ముంబైకి చెందిన హీరోయిన్‌పై వైసీపీ నేతలు, పోలీసులు చేసిన వేధింపుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అత్యంత వివాదంగా మారుతున్నది. ఈ వ్యవహారంలో ముంబై నుంచి హీరోయిన్‌ను విజయవాడకు తీసుకొచ్చిన వ్యవహారాన్ని తాజా దర్యాప్తు కిడ్నాప్ కేసుగా మారనుండటంతో ఈ కేసు వ్యవహరం రాజకీయ నేతలకు, పోలీస్ అధికారులకు చుట్టుకొనే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ కేసు విచారణ, వార్తల వివరాల్లోకి వెళితే..

హిందీ హీరోయిన్‌తో విజయవాడకు చెందిన ప్రముఖ వైసీపీ నేత కుమారుడు ప్రేమ వ్యవహారం నడిపారు. అయితే పెళ్లి వరకు వచ్చే సరికి కుటుంబం వ్యతిరేకించడంతో సదరు ప్రేమికుడు ప్లేట్ ఫిరాయించాడు. అయితే ఆ అమ్మాయి వినకపోవడం, బెదిరింపులకు పాల్పడటంతో రాజకీయ నేత తన పార్టీ కీలక నేతలకు తన కుమారుడి వ్యవహరాన్ని వివరించారు. దాంతో అప్పటి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నేత నిర్ణయంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Is Kadambari Jetwani Case turns serious to YSRCP Leaders and AP Police

అయితే ముందుగా హీరోయిన్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో పోలీసు అధికారులు ముంబైకి వెళ్లారు. బాధితురాలు హీరోయిన్ కుటుంబాన్ని బెదిరించారు. వారిని విజయవాడకు తీసుకువచ్చారు. ఆ తర్వాత 14 రోజులపాటు ఓ గెస్ట్ బంధించి వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు అనేది మీడియాలో ప్రధానంగా వెలుగు చూశాయి.

ఇదిలా ఉండగా, ఈ వివాదంలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. సదరు హీరోయిన్‌కు ముంబైలోని పారిశ్రామిక వేత్తపై అక్కడే కేసు నమోదు చేశారు. అయితే ఆ పారిశ్రామిక వేత్తను కాపాడేందుకు వైసీపీ నేతలు, పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారనే విషయం మరో కథనం బయటకు వచ్చింది.

Is Kadambari Jetwani Case turns serious to YSRCP Leaders and AP Police

అయితే హీరోయిన్‌పై చిత్ర వధ చేసినీ తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అన్ని వివరాలు సేకరిస్తున్నది. ఈ కేసుపై ఆచీతూచీ వ్యవహరిస్తూ.. రాజకీయ నేతలు, పోలీసు అధికారులపై కేసులు పెట్టే ఆలోచనలో ఉంది. ఈ కేసు దిశగా అడుగులేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

పారిశ్రామిక వేత్తపై కేసు, లేదా విజయవాడ రాజకీయ నేత కుమారుడి ప్రేమ వ్యవహారం ఆధారంగా ఆ హీరోయిన్‌‌ను వేధించారా? అనేది తేల్చాల్సిన ప్రశ్నగా మారింది. ప్రభుత్వం, పోలీసులు చేసే దర్యాప్తు ఆధారంగా ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకొంటారనే విషయం చర్చనీయాంశమవుతున్నది. అయితే ఈ హిందీ హీరోయిన్‌ ప్రముఖ మీడియాకు ఫోన్ ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనంగా మారింది. పారిశ్రామిక వేత్తపై నమోదు చేసిన ఫిర్యాదులో కాదంబరి జెత్వానీగా అని గుర్తించారు.

More from Filmibeat

Read more about: kadambari jetwani ysrcp ap police
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X