Emergency Ban: ఎమర్జెన్సీ సినిమాపై బ్యాన్? కంగనకు చుక్కలు చూపిస్తున్న సిక్కులు!
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమాలో సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బ తీశాయని పంజాబ్ రాష్ట్రంలో సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ప్రదర్శించేది లేదని డిస్టిబ్యూటర్లు షాకింగ్‌గా నిర్ణయం తీసుకొన్నారు. దాంతో ఈ సినిమా రిలీజ్ తర్వా త వివాదాల్లో కూరుకుపోయింది. ఈ వివాదానికి కారణం ఏమిటంటే?
కంగన నిర్మాతగా, దర్శకురాలిగా మారడమే కాకుండా నటించిన ఎమర్జెన్సీ చిత్రం జనవరి 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సిక్కుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఈ సినిమాను పంజాబ్‌లో బ్యాన్ చేయాలని సీఎంకు భగవంత్ సింగ్ మాన్‌కు శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ నేత హర్జిందర్ సింగ్ ధామీ లేఖ రాశారు.

ఎమర్జెన్సీ సినిమాలోని కంటెంట్ సిక్కుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని పంజాబ్‌లో ఆందోళనలు చేపట్టారు. ఈ సినిమాను వెంటనే రద్దు చేయాలని తీర్మానం చేసి.. ఆ లేఖను ముఖ్య కార్యదర్శికి పంపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే సిక్కులందరూ ఉద్యమించి సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తామని లేఖలో హెచ్చరించారు.
సిక్కులకు వ్యతిరేకంగా సన్నివేశాలను చిత్రీకరించారు. 1984 సంవత్సరంలో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో జరిగిన సంఘటనలకు సీన్లు తమ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నాయి. సిక్కుల వ్యతిరేక ఎజెండాతో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఎస్‌పీజీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజాబ్‌ను ప్రత్యేకం దేశంగా ప్రకటించాలని జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే చేపట్టిన ఉద్యమాన్ని అణిచివేయడానికి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ ఇందిరా తీసుకొన్న నిర్ణయంతో స్వర్ణ దేవాలయంపై భారత సేనలు దాడి చేసి.. మిలిటెంట్లను భారీ సంఖ్యలో కాల్చి చంపిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ సన్నివేశాన్ని కంగన తన సినిమాలో ప్రధానంగా చూపించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎమర్జెన్సీ సినిమాలో కంగన రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. అటల్ బీహారి వాజ్‌పేయ్‌గా శ్రేయాస్ తల్పాడే, లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, జగ్జీవన్ రామ్‌గా సతీష్ కౌశిక్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షాగా మిలింద్ సోమన్, తన అంతరంగీకురాలు పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరీ, మురార్జీ దేశాయ్‌గా అశోక్ చాబ్రా, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ తమ పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











