Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి ఏపీ ప్రభుత్వంలో అరుదైన పదవి? అఫీషియల్ క్లారిటీ ఏమిటంటే?
మాములుగా తెలుగు సినిమా దగ్గర ఓ హీరోయిన్ మొదటి సినిమా తోనే హిట్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. కానీ అలా హిట్ అవ్వడం అటుంచితే వారి డెబ్యూ సినిమా తర్వాత కూడా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నారా లేదా అనేది మాత్రం ఇక్కడ పెద్ద విషయం అని చెప్పాలి. కాగా ఇలా టాలీవుడ్ లో ఒక ప్లాప్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం మంచి హ్యాపెనింగ్ బ్యూటీగా మారిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి అనే చెప్పవచ్చు.
కాగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన అన్ని సినిమాల్లో ఒకటి హిట్ అయితే ఒకటి ప్లాప్ అవుతుంది. ఇలా తెలుగు సహా తమి సినిమా దగ్గర మీనాక్షి చౌదరి నెట్టుకొచ్చేస్తుంది. కాగా రీసెంట్ గానే తన కెరీర్లో భారీ హిట్ అది కూడా తెలుగులో ఇండస్ట్రీ హిట్ సంక్రాంతికి వస్తున్నాంతో తెలుగులో మాసివ్ హిట్ అందుకోగా తెలుగులో మీనాక్షి చౌదరి కొత్త ఊపు అందుకుంది అని టాక్ కూడా గట్టిగా ఊపందుకుంది.

ఇలా తెలుగులో మంచి ఫామ్ లోకి వచ్చింది అనుకున్న ఈ బ్యూటీపై కొన్ని ఊహించని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కాగా మీనాక్షి చౌదరికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక భాద్యతలు అప్పగించింది అంటూ ఓ టాక్ వైరల్ గా మారింది. మీనాక్షిని ఏపీ విమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్ గా నియమించారు అంటూ ఓ టాక్ కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసింది.
దీనితో ఇది చాలా మంది నిజమే అని కూడా అనుకున్నారు. పైగా సదరు హీరోయిన్ గా కూడా మౌనం గానే ఉండేసరికి మిగతా కొందరు కూడా నిజమే అనుకున్నారు. కానీ అసలు దీనిపై నిజాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ గవర్నమెంట్ వారు రివీల్ చేశారు. ఆమెపై వైరల్ అవుతున్న పలు సోషల్ మీడియా పోస్ట్ లని పెట్టి మీనాక్షి చౌదరిపై స్ప్రెడ్ అవుతున్న ఈ వార్తలు మొత్తం ఫేక్ అని ప్రభుత్వం పేరుతో ఇలా ఉద్దేశపూర్వకంగా పోస్ట్ లు చేస్తున్నవారు అందరిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఈ వార్తలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు.
దీనితో మీనాక్షి చౌదరిపై వైరల్ గా మారిన ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇక ఇవి పక్కన పెడితే మీనాక్షి చౌదరి నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం రీసెంట్ గానే ఓటిటిలో కూడా విడుదల అయ్యి రికార్డు రెస్పాన్స్ కొల్లగొట్టగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు.
అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో యువ హీరో నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలో కనిపించనుంది. అలాగే తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు చేస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా టాలీవుడ్ లో తాను దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











