జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో చిరంజీవి.. కేసీఆర్‌ను చిత్తు చేసేందుకు రేవంత్ బంపర్ ప్లాన్?!
రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి పాలిటిక్స్‌లోకి అడుగుపెడుతారా? అనే అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలు మార్లు రాజకీయాలకు తాను దూరం అంటూ ఎన్నోసార్లు పలు వేదికలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకోవడం అనేక ఊహగానాలకు తెర తీశాయి. త్వరలో తెలంగాణలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ఊహగానాలు, బీఆర్ఎస్ అధికార మీడియా ఛానెల్ ఆసక్తికరమైన కథనాన్ని ప్రసారం చేయడంతో ఈ అంశం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ ఆఫిషియల్ ఛానెల్‌లో ప్రసారమైన కథనం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ హోదాతో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్, చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ లాంటి రెండు బలమైన పార్టీలతో తలపడిన చిరంజీవి చివరకు 20కి పైగా ఎమ్మెల్యే స్థానాలను గెలిచారు. అయితే పార్టీని నడిపే స్థాయి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా కాంగ్రెస్‌లో కొనసాగారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి చూపకుండా కేవలం సినిమాలపై ఫోకస్ పెట్టారు.

అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక జరుగనున్నది. ఈ ఉప ఎన్నికలో పోటీపడేందుకు అజారుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి ప్రముఖులు ఆస్త్రాలు సన్నద్ధం చేసుకొంటున్నారు. కాంగ్రెస్‌లో ఈ పోటీ కోసం చాలా మంది ప్రముఖులు, ఆశావహులు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే.. టీ న్యూస్ ఇంట్రెస్టింగ్ కథనంలో చిరంజీవి పేరును తెరపైకి తెచ్చారు.
టీ న్యూస్ కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవిని దింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికల గెలిస్తే.. మెగాస్టార్‌కు హోం మంత్రి పదవిని ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. బలమైన బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే.. కాంగ్రెస్ బలానికి, సినీ గ్లామర్ తోడు చేయాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు అని వెల్లడించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు జరిపిన సర్వేలో బీఆర్ఎస్‌తో పోటీ విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది. ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకొన్నారు. అందుకే చిరంజీవిని బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే.. పార్టీకి జీహోచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురే ఉండదనే విధంగా ఓ ప్లాన్‌ను సిద్దం చేశారు. చిరంజీవితో ఈ విషయంపై చర్చించి... అధిష్టానానికి నివేదించేందుకు సిద్దమయ్యారు. ఆ క్రమంలోనే వారిద్దరి భేటీ ఇటీవల జరిగింది. అలాగే ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టారు. అయితే రేవంత్ ప్రతిపాదనను అధిష్టానం ఒప్పుకొంటుందా? లేదా అనే వేచి చూడాలి అని టీ న్యూస్ తన కథనంలో చెప్పుకొచ్చింది.
అయితే తన కోడలు ఉపాసనకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని స్పోర్ట్ష్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ధన్యవాదాలు తెలియజేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చంరజీవి కలిశారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదు అని అటు కాంగ్రెస్, ఇటు చిరంజీవి వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం సానుకూలంగా ఈ వార్తపై స్పందిస్తున్నాయి. కేసీఆర్‌కు ఈ ఉప ఎన్నికల్లో చెక్ పెట్టాలంటే.. సీఎం రేవంత్ ఈ రేంజ్ ప్లాన్ చేయడం అవసరమే అని చెప్పుకొంటున్నారు. ఈ రూమర్ వార్తపై రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











