పవన్ కల్యాణ్‌కు ఆ నిర్మాతతో విభేదాలున్నాయా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర భారీ ఫేమ్ ఉన్న అతి కొద్దీ మంది స్టార్ హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి తన అన్నయ్య చిరు నీడ లోనే ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ తాను కూడా తన రక్తాన్ని చిందిస్తే కానీ ఈ స్థాయి ఫాలోయింగ్ తనకి రాలేదు. ఇక సినిమాతో పాటుగా రాజకీయాల్లో కూడా ఇప్పుడు అద్భుతంగా రాణించడంతో పాటుగా పవన్ ఇప్పుడు ఏపీలో సహా టాలీవుడ్ లో కూడా చక్రం తిప్పే లెవెల్ కి ఎదిగి కుటుంబీకులకు అభిమానులకి గర్వ కారణంగా నిలిచాడు.

కాగా ఇప్పటికే పవన్ తో పలు సినిమాలు చేస్తూ నిర్మాతలు లైన్ లో ఉన్నారు కానీ పవన్ ఇప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఓ పక్క పలు శాఖల్లో మంత్రి ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి హోదా పవన్ ని ఏపీలో వరించాయి. కాగా తమ ఇండస్ట్రీ హీరోగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ నిలిచే సరికి నిన్ననే నిర్మాతలు అంతా పవన్ ని కలిసేందుకు వెళ్లారు.

Is Pawan Kalyan had differences with Bunny Vasu over Janasena Ticket

ఇక ఈ మీట్ లో చాలా మంది దిగ్గజ నిర్మాతలతో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు కూడా కనిపించాడు. అయితే ఇటీవల కొన్ని రోజులు కితం పవన్ కి బన్నీ వాసు కి దూరం పెరిగింది అని ఒక టాక్ వచ్చింది. గోదావరి జిల్లాల్లో పవన్ కోసం బన్నీ వాసు పొలిటికల్ గా చాలానే చేసాడు. అయితే ఇది సీట్ ఆశించి చేసాడు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. కానీ చివరికి బన్నీ వాసుకి ఎలాంటి సీట్ ఇవ్వలేదు.

దీనితో చిన్నబుచ్చుకున్న బన్నీ వాసు పవన్ విషయంలో ముభావంగా ఉన్నాడని కొన్ని రూమర్స్ వచ్చాయి. దీనితో ఇద్దరికీ చెడింది అని కూడా కొందరు అనేసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే నిన్న మీట్ లో బన్నీ వాసు కూడా పవన్ కల్యాణ్‌తో కనిపించాడు. దీనితో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పవచ్చు.

Is Pawan Kalyan had differences with Bunny Vasu over Janasena Ticket

కాగా బన్నీ వాసు తన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పలు మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక మరో పక్క పవన్ కళ్యాణ్ తన భారీ చిత్రాలు ఓజి, హరిహర వీరమల్లు ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ లను తిరిగి స్టార్ట్ చేయాల్సి ఉంది. కాగా ఈ చిత్రాలను వరుసగా సుజీత్, జ్యోతి కృష్ణ అలాగే హరీష్ శంకర్ లు దర్శకత్వం వహిస్తున్నారు. వీటిలో హరిహర వీరమల్లు ఒకటి ఈ ఏడాది రిలీజ్ కి లాక్ అయ్యింది. అలాగే ఓజి వచ్చే ఏడాదికి షిఫ్ట్ కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంకా చాలా మేర షూటింగ్ ని పూర్తి చేసుకోవాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: pawan kalyan bunny vas janasena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X