Union Budget 2024: ఏపీపై కేంద్ర వరాల జల్లు..అంతా పవన్ వ్యూహం వల్లేనా? ఆంధ్రా దిశ,దశ జనసేనాని మార్చేస్తున్నాడా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి అనే మరోసారి రుజువైంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత అనేక అవమానాలు, చీత్కారాలు, విమర్శలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పార్టీని పటిష్టం చేశాడు.తన చుట్టూ ఉన్న నేతలను నమ్మించే పనిని పక్కన పెట్టి.. ప్రజల్లో విశ్వాసాన్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. నేతలు, ప్రజలతో ఆయన పదే పదే చెప్పిన విషయం ఒక్కటి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
చంద్రబాబు నేతృత్వంలోనే తెలుగు దేశం, బీజేపీతో పొత్తు కోసం పవన్ ప్రయత్నించడం సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకే రుచించలేదు. కానీ వారిని అసంతృప్తిని ఖాతరు చేయకుండా తన ఆలోచన విధానం, విజన్‌తో ముందుకెళ్లారు. అప్పటి అధికార ప్రభుత్వం విమర్శలను తన మాటల తూటాలతో చిత్తు చేశారు.

ఏపీలో 10 సంవత్సరాలపాటు పార్టీని బలోపేతం చేశాను. అలాంటి నన్ను విమర్శించకుండా మనస్పూర్తిగా నమ్మండి. ఎందుకు చెబుతున్నాననంటే? జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత.. ఏపీ దిశ,దశ మార్చివేస్తాను అని అత్యంత విశ్వాసంతో తన కార్యకర్తలతో విన్నవించుకొన్నాడు.
ప్రస్తుతం సీన్ కట్ చేస్తే.. జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించుకొన్నది. ఏపీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను సొంతం చేసుకొన్నది. ప్రధాని మంత్రి చేత ఆయన పవన్ కాదు.. తుఫాన్ అంటూ ప్రశంసలు అందుకొనేలా కూటమిని గెలుపును పవన్ గెలిపించుకొన్నాడు.
పవన్ కల్యాణ్ పొత్తుల వ్యూహం ప్రస్తుతం ఏపీకి సత్పలితాలు ఇస్తున్నది. పవన్ ఒత్తిడి వల్ల కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిలబడింది. అంతేకాకుండా ఏపీకి అత్యంత గుర్తింపు పార్లమెంట్‌లో దక్కింది. దాని ఫలితం ఆంధ్రప్రదేశ్‌పై తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దాంతో ఏపీలో పలు వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తున్నది.
చంద్రబాబు, మోదీ పార్టీలను పవన్ కల్యాణ్ కలపడమే ఏపీ దశ, దిశను మార్చడానికి కారణమైందనే కామెంట్స్ మీడియాలోను, సోషల్ మీడియాలోను వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో పవన్ చెప్పిన మాటలు, స్పీచ్‌లను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకొంటూ మరోసారి గుర్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











