ఆ ట్రాప్‌లో ప్రకాశ్ రాజ్! పవన్ కల్యాణ్‌పై ఫేక్ ప్రచారమా?

తెలుగు సినిమా పవర్ స్టార్ ఇంకా ఇండియన్ పాలిటిక్స్ లో కీలక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాల కంటే పాలిటిక్స్ పరంగానే నేషనల్ వైడ్ గా సంచలనం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గెలిచి ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారో అక్కడ నుంచే తన మార్క్ స్టార్ట్ అయ్యింది.

మెయిన్ గా తిరుపతి లడ్డు ఇష్యూ నుంచి పవన్ మూమెంట్స్ పాన్ ఇండియా లెవెల్లో హైలైట్ గా మారుతూ వచ్చాయి. దీనితో పాటుగా సెన్సిటివ్ అంశం సనాతన ధర్మం పరంగా తీసుకున్న స్టాండ్ అలానే సెక్యులరిజం కోసం ఇంకా ఇటీవల హైలైట్ గా మారిన హిందీ భాషలు ఇంప్లిమెంట్ పై చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో అటు హిందీ జనం ఇటు తమిళ్ సహా తెలుగు జనంలో కూడా పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.

Prakash Raj Targeting Pawan Kalyan

కాగా పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తన నియోజకవర్గం పిఠాపురంలో పెట్టిన భారీ బహిరంగ సభ తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇచ్చిన స్పీచ్ కి ఈసౌండ్ నాలుగు రోజులు అయినా సోషల్ మీడియాలో తగ్గడం లేదు. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కొనసాగుతుండగా తనపై తన తోటి నటుడు ప్రకాష్ రాజ్ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ సంచలన పోస్ట్ లు పెడుతూ పవన్ అభిమానులని ట్రిగ్గర్ చేస్తున్నారు.

Take a Poll

కాగా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా నుంచి గతంలో తాను హిందీ భాష పట్ల వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ లు తాను బీజేపీకి అనుకూలంగా ఉన్నారని డిలీట్ చేసేస్తున్నారు అంటూ ఒక టాక్ స్ప్రెడ్ అవుతుంది. కాగా పవన్ కళ్యాణ్ పై ఇది వరకే ఎన్నో ఫేక్ ప్రచారాలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పవన్ చెప్పిన మాటలు తమకి కావాల్సినంత వరకే ఎడిట్ చేసి కట్ చేసుకొని తనపై నెగిటివ్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు.

ఇలానే ఇపుడు ట్వీట్స్ పై పేటిఎం బ్యాచ్ పడ్డారు. కాగా ఈ ట్రాప్ లో ప్రకాష్ రాజ్ కూడా పడటం గమనార్హం. పవన్ పలు ట్వీట్స్ డిలీట్ చేసేసారు అని ఓ ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు పవన్ ఒక్క ట్వీట్ కూడా డిలీట్ చేయలేదు. కానీ తాను చెయ్యని ట్వీట్స్ చేసినట్టుగా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

ఇక మరికొన్ని ట్వీట్స్ కూడా భయపడి డిలీట్ చేశారు అంటూ కొన్ని ప్రచారాలు చేస్తున్నారు కానీ నిజానికి ఆ ట్వీట్స్ ఇప్పటికీ పవన్ ఖాతాలో ఉన్నాయి. దీనితో డిప్యూటీ సీఎం ఎప్పుడూ ఒకే స్టాండ్ లో ఉన్నారని తన ఖాతా చెక్ చేసుకోవచ్చని పలు ట్వీట్స్ లింక్స్ కూడా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అందిస్తున్నారు. మరి ఏవైతే చేయని ట్వీట్స్ పవన్ డిలీట్ చేసాడు అని స్ప్రెడ్ చేస్తున్నారో దానిని ప్రకాష్ రాజ్ కూడా నమ్మి షేర్ చేస్తుండడం చూసి ఇదే సోషల్ మీడియాలో చాలా మంది నవ్వుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం పవన్ విషయంలో పెద్ద హంగామానే నడుస్తుంది అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X