వైసీపీకి రోజా గుడ్ బై? స్టార్ హీరో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి

వివాదాస్పద పొలిటిషియన్, మాజీ మంత్రి, జబర్దస్త్ ఫేమ్ రోజా సెల్వమణి ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ గురి అవుతున్నది.అధికారంలో ఉన్నప్పుడు మహిళ కట్టుబొట్టు గురించి సుద్దపూసలా ఉపన్యాసాలు ఇచ్చిన ఈ నటి.. ప్రస్తుతం యూరప్‌లో మినీ స్కర్టులతో కనిపించడంతో ఆమెను కామెంట్లతో ఆటాడుకొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సంచలన వార్త వివరాల్లోకి వెళితే..

గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైన తర్వాత రోజా ప్రజా జీవితానికి దూరమైంది. అలాగే క్రీడల సంబురాలకు సంబంధించిన అంశంలో అక్రమాలకు పాల్పడినట్టు స్పోర్ట్స్ సంఘాలు ఫిర్యాకి దు చేయడంతో ఆమె అరెస్ట్ ఖాయమనే వార్తలు బలంగా వినిపించాయి. దాంతో ఆమె మీడియాకు, జనానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

Is Roja Selvamani to say Good bye to YS Jagan s YSRCP

నగరిలో ఓటమి తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారనేది స్పష్టమైంది. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయ సందర్భనకు వెళ్లిన ఆమె వివాదంలో కూరుకుపోయారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ద కార్మికులను దూరంగా ఉంటాలని వివక్ష చూపడం కూడా ఆమె విమర్శలకు గురైంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె తమ కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పొట్టి, చిట్టి దుస్తులతో దర్శనమిచ్చారు. దాంతో ఆమె తీరును చూసి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మహిళలంటే చీరకట్టు, నుదుట బొట్టు పెట్టుకోవాలి. అలా వెస్ట్రన్ దుస్తుల్లో మగరాయుడిలా కనిపిస్తారా అంటూ నీతులు చెప్పిన వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Is Roja Selvamani to say Good bye to YS Jagan s YSRCP

ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటి ముట్టనున్నట్టు ఉంటున్న రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆమె తన భర్త సొంత రాష్ట్రంలో తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్స్ చేప్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలోను ఈ వార్త ప్రచారంలో ఉంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆగమె సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఏపీలొ ఆమె రాజకీయ కార్యకలాపాలకు చోట లేకపోవడం, నగరిలో సొంత పార్టీలే తనను ఓడించారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తెలుగు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Read more about: roja selvamani ysrcp vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X