ఆ ఒక్కటే విజయ్ గెలుపుకు కారణమా? దళపతి స్కెచ్ అలా వర్కవుట్!
టీవీకే పార్టీని స్థాపించిన దళపతి విజయ్ కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయడం సంచలనంగా మారింది. పార్టీ ప్రకటించినప్పటి నుంచి అయన అనుసరించిన విధానాలు, సమస్యలు ఎదుర్కొన్న తీరు కారణంగానే ఓటర్లు, ప్రజల మనసులో చోటు మరింతగా సంపాదించాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల పండుగకు ముందు ఆయన చేసిన గూస్ బంప్స్ స్పీచ్ విజయానికి చేరువ చేసిందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రోమాలు నిక్కబొడిచే విధంగా చేసిన విజయ్ స్పీచ్ వివరాల్లోకి వెళితే..
రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత విజయ్ ప్రత్యర్థులను డైరెక్ట్‌గా ఎటాక్ చేసిన తీరే ఆయనను జన నాయకుడిగా నిలబెట్టేలా చేసింది. ఆయన చేసిన ఉపన్యాసాలు ప్రజలను ఆలోచింపజేసింది. ప్రతీ ఓటర్‌లో మార్పు తెచ్చే విధంగా ఆయన విధానాలు దోహదపడ్డాయి. అయితే ఓటింగ్‌కు ముందు విజయ్ చేసిన ప్రసంగమే ఓటర్లలో చైతన్యం కలిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో విజయ్ మాట్లాడుతూ.. మధురై తూర్పు నియోజకవర్గంలో అభ్యర్థి విజయ్, మధురై వెస్ట్‌లో అభ్యర్థి విజయ్. మధురై సెంట్రల్‌లో కూడా అభ్యర్థి విజయే. మధురై సౌత్‌లో కూడా అభ్యర్థి విజయ్. మధురై నార్త్‌లో కూడా కాండిటేట్ విజయ్. మేలూరులో విజయ్. సొడవందన్‌లో విజయ్. తిరుపరనణ్ గూడెంలో విజయ్, తిరుమంగళంలో విజయ్, ఉస్సలం బట్టిలో కూడా విజయ్ ఉంటాడు. నేను సీటు ఇచ్చిన వ్యక్తిలో విజయ్‌ను చూడండి. విజయ్ పోటీ చేశాడని ఓటు వేయండి అని అభ్యర్థించారు.
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేసే వ్యక్తి విజయ్‌గా భావించి ఓటు వేయండి. మీ విజయ్ కోసం ఓటు వేయడం మరిచిపోకండి అంటూ ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని ఇచ్చారు. విజయ్ చేసిన ఆ ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. ఓటర్లలో చైతన్యాన్ని నింపింది. విజయ్ సీటు ఇచ్చిన ప్రతీ ఒక్కరిని గెలిపించాలనే పట్టుదలను నింపిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలవడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే పార్టీ 110 సీట్లలో అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఏఐడీఎంకే 64 సీట్లు, డీఎంకే 60 సీట్లలో అధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే మెజారిటీకి అతికొద్ది సీట్ల దూరంలో విజయ్ ఉన్నారు. అధికారాన్ని చేపట్టడానికి 118 సీట్లు కావాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయి మెజారిటీ సాధించి సీఎం పీఠంపై విజయ్ కూర్చోవడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications