Ritu Chowdary: 700 స్కామ్‌పై రీతూ చౌదరీ క్లారిటీ.. జబర్దస్త్ నటి నోట వైసీపీ నేతల పేర్లు?

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన భారీ కుంభకోణంలో 700 కోట్ల రూపాయల మేర స్కామ్‌ వివాదంలో జబర్దస్త్ యాక్టర్ రీతూ చౌదరీ పేరు ప్రముఖంగా వినిపించింది. గోవాలో వైసీపీ నేతల రేవ్ పార్టీ ఆరోపణలు, భారీగా భూమి రిజిస్ట్రేషన్లు, ధరమ్ సింగ్ అనే వ్యక్తి కిడ్నాప్, గోవా పార్టీలో సినీతారల హాజరు లాంటి ఎన్నో షాకింగ్ అంశాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ మహా న్యూస్‌కు రీతూ చౌదరీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. రీతూ చౌదరీ చెప్పిన వివరాల్లోకి వెళితే..

ఏపీలో జరిగిన వేల కోట్ల రూపాయల స్కామ్‌లో ప్రధానంగా పేరు వినిపిస్తున్న చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో నాకు వివాహం జరిగింది. అయితే కొందరు చెప్పిన ప్రకారం ఆయనకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందనే విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. అయితే ఆయనతో కలిసి నేను నాలుగు సార్లు గోవాకు వెళ్లాను. కొన్ని కారణాల వల్ల నేను, శ్రీకాంత్ ఏడాదిన్నర క్రితం విడిపోయాం. గోవాకు వెళ్లిన సమయంలో ధరమ్ సింగ్ అనే వ్యక్తి రాలేదు. రేవ్ పార్టీ నిర్వహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరమ్ సింగ్ అనే వ్యక్తి కిడ్నాప్ జరిగిందని విషయం ఇప్పుడే తెలిసిందని ఆమె తెలిపారు.

Jabardasth Fame Ritu Chowdary Clarity on 7000 Crore Scam of Andhra Pradesh

శ్రీకాంత్ నా పేరు మీద రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. నా పేరు పవర్ ఆఫ్ అటార్నీ రాశారు. దాని విలువ 4 కోట్ల రూపాయలు తెలిసింది. ఏసీబీ వాళ్లు రైడింగ్ చేసిన సమయంలో నా మంగళ సూత్రం తీసుకెళ్లారని చెప్పారు. ఆ కారణంగా మేము విడిపోలేదు. అప్పటికే మేము డైవోర్స్‌కు దరఖాస్తు చేశాం. నాకు 700 కోట్ల రూపాయల స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు.

శ్రీకాంత్‌తో ఉన్న సమయంలో వైసీపీ నేతలు కేఎన్ఆర్, సజ్జల, రామారావు అనే పేర్లు చెప్పేవాడు. వాళ్లతో సంబంధాలు ఉన్నాయనేది శ్రీకాంత్ ఫోన్ సంభాషణతో అర్ధమైంది. వారికి ఎలాంటి సంబధాలు ఉన్నాయనేది నాకు తెలియదు. నన్ను శారీరకంగా వేధించే వాడు. నా బ్యాంక్ అకౌంట్స్ ఏసీబీ అధికారులు సీజ్ చేశారనే నాకు తెలియదు. నన్ను అనవసరంగా బలి చేస్తున్నారు అని రీతూ చౌదరీ అన్నారు.

Jabardasth Fame Ritu Chowdary Clarity on 7000 Crore Scam of Andhra Pradesh

వైసీపీ నేతల గురించి తెలియదు. కానీ నేను నాకు తెలియకుండానే ఈ కుంభకోణంలో ఇరుక్కుపోయాను. నాకు ఈ కేసుతో సంబంధం లేదు కాబట్టి నా గురించి వీడియో కథనాలు తొలగించండి. నా ఫోటో పెట్టిన థంబ్ నెయిల్ తొలగించండి అని రిక్వెస్ట్ చేసింది. ఒకవేళ ఈ కేసులో సంబంధం ఉందని తెలిస్తే.. ఏకంగా నా పోస్టర్లే వేయండి అని ధీమా వ్యక్తం చేసింది.

అయితే ఏపీలో జరిగిన భూ కుంభకోణం, గోవాలో జరిగిన రేవ్ పార్టీకి సంబంధం ఉందా? అసలు గోవాలో ధరమ్ సింగ్ అనే వ్యక్తి రేవ్ పార్టీ నిర్వహించాడా? ఆ పార్టీకి హాజరైన సినీ తారలు ఎవరు? ఏ మేరకు భూ కుంభకోణం జరిగింది? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఈ వ్యవహారాలన్నీ జరిగాయా? అనేది తెలియాలంటే ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దర్యాప్తులో తేలాల్సిందే.

More from Filmibeat

Read more about: jabardasth ritu chowdary ysrcp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X