అప్పుడు గబ్బర్ సింగ్.. ఇప్పుడు రబ్బర్ సింగ్.. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ రోజా

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై సినీ నటి, వైఎస్సార్సీపీ నేత రోజా సెల్వమణి నిప్పలు చెరిగారు. వైసీపీ ప్రారంభించిన యువత పోరు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రోజా తన నియోజకవర్గం పరిధిలో నాయకులతో కలిసి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువత పోరు ఆందోళనలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..

పక్క రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబుకు సీఎం పదవి, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి, పక్క రాష్ట్రంలోనే ఉండే లోకేష్‌కు మంత్రి జాబ్. తన కొడుకును సీఎం చేయడానికి చంద్రబాబు ఎంత తపన పడుతున్నారో చూస్తున్నాం. మరో పక్క తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడానికి పవన్ కల్యాణ్ కష్టపడుతున్నాడు అని రోజా ఎద్దేవా చేశారు.

Roja Selvamani fires on Pawan Kalyan

ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ.. జాబ్ గ్యారెంటీ. ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచిన తెలుగు దేశం పార్టీ జేమ్స్ బాండ్స్ ఎక్కడ? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పడానికి ముందుకు రావాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మాట ఇచ్చి మరిచామని ఆలోచించకపోవడం చాలా బాధాకరం అని రోజా డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందేమో పవర్ స్టార్‌లా ఊగిపోతూ ఎన్నో మాటలు మాట్లాడారు. పవర్‌లోకి వచ్చాక.. యూత్ చెవుల్లో ఫ్లవర్ పెడుతున్నారు. ఎలక్షన్‌కు ముందు గబ్బర్ సింగ్ మాదిరిగా డైలాగ్స్ చెప్పాడు. యూత్‌కు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని నిలదీస్తే.. ఇప్పుడు రబ్బర్ సింగ్ మాదిరిగా మెలికలు తిరుగుతున్నాడు. ప్రజా జీవితానికి దూరమవ్వడంతో యూత్ ఆయన ఫోటో పట్టుకొని వెతుకుతూ పవన్ కల్యాణ్ కనబడుట లేదని ప్లకార్డుల పుట్టుకొని తిరుగుతున్నారు అని రోజా విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇవ్వడం లేదని నిలదీస్తే.. నేను హరిహర వీరమల్లు షూటింగులో బిజీగా ఉన్నాను. పది లక్షలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని హామి ఇచ్చారు. ఆ విషయమేమైందంటే.. ఆయన OG షూటింగులో ఉన్నాడు అని చెబుతాడు. పది లక్షలు ఇవ్వకపోయినా పర్వాలేదు. కనీసం 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వండి అని అడిగితే.. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగులో బిజీగా ఉన్నారు. మా ఫోన్లకే సమాధానం ఇవ్వడం లేదు అని చెబుతున్నారు అని ఆమె అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌కు ఒకటే హెచ్చరిక. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల ఓట్లు వేసుకొని వాళ్లను మోసం చేస్తే ఎవర్నీ వదిలిపెట్టం, మా పార్టీ ఊరుకోదు. వెంటనే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి. లేదా 13 నెలల నిరుద్యోగ భృతిని నెలకు 3 వేల చొప్పన చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X