‘రోజా.. గాలి ముంX మాటలు మాట్లాడకు.. జబర్దస్త్ వేషాలు వెయ్యకు’
వైసీపీ నేత, నటి, జబర్దస్త్ జడ్జి రోజా సెల్వమణిపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లను ఆయన తప్పుపట్టారు. ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె చేసిన దారుణమైన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆమె హుందాగా మాట్లాడాలని సూచిస్తూ ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. రోజాపై టీడీపీ నేత చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
రోజక్క స్పీచ్‌లు, ప్రెస్ మీట్లు వింటున్నాను. ఆమె నుంచి పాత రోజా బయటకు వచ్చింది. రోజక్క ఒకటి గుర్తు పెట్టుకొ. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. మాకు మర్యాద ఇస్తే మేము నీకు ఎక్కువ మర్యాద ఇస్తాం. సంస్కారంతో మాట్లాడితే.. మేము ఎక్కువ సంస్కారంతో మాట్లాడుతాం. రోజా అంటానా? రోజక్క అని పిలుస్తాను. ఎందుకంటే మా ఆడ పడుచువి. మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు.. గాలికి గెలిచారు అని అన్నావు. నేనేమి అంటానంటే.. గాలి ముండలు.. గాలికి ఓడియారని అంటే ఒకేనా? ఇలాంటి మాటలు మనకు అవసరమా? అని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

తోటి ఎమ్మెల్యేలపై నీవు అలా మాట్లాడటం నాకు చాలా అసహ్యం వేసింది. నాకు నచ్చుతుందా? గాలి నా కొడుకులు ఏంటి? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్దతి ఉండకూడదా? రాజకీయాల్లో రెస్పక్ట్ ఉండకూడదా? మేము ఏమైనా విమర్శిస్తే.. టెలివిజన్ ఛానెల్‌లో భోరుమని ఏడుస్తావు అని ఆనం వెంకట రమణారెడ్డి ఎద్దేవా చేశారు.
రోజాకు నేను సలహా ఇవ్వాలని అనుకొంటున్నాను. నగరిలో మా ఎమ్మెల్యే భాను.. గౌరవ ప్రదమైన మంచి కుటుంబం నుంచి వచ్చారు. నీలాగా గాలి కుటుంబానికి చెందిన వాడు కాదు. నీ మాదిరిగా ఊరంతా తిరిగి.. సైక్లోన్‌లా చుట్టుముట్టి నగరికి రాలేదు.ఆయన నగరిలోనే పుట్టి పెరిగారు. భాను స్థానికుడు.. నీవు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చావు? ఈ రోజు నగరికి వచ్చి అతడిని గాలి నా కొడుకు అంటావా? అని ఆయన ఘాటుగా స్పందించాడు.
నగరికి నీవు ఎక్కడి నుంచి వచ్చావు? మొన్నటి వరకు నీవు ఎక్కడ ఉన్నావు? జబర్దస్త్ షోలో వెకిలిగా నవ్వులు నవ్వినది నీవు కాదా? ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేను అవమానించేలా గాలి నా కొడుకు అంటావా? ఇలా నీవు గాలి ముండ మాటలు మాట్లాడ వద్దని నీకు మనవి చేస్తున్నాను. ఇక నుంచి పద్దతిగా మాట్టాడటం నేర్చుకో అంటూ ఆయన తీవ్రస్థాయిలో రోజాను మందలించారు.
గత కొద్దికాలంగా టెలివిజన్ షోలతో బిజీగా మారిన రోజా సెల్వమణి.. తనకు వీలు చిక్కినప్పడల్లా, పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో బిజీగా కనిపిస్తున్నారు. ఏపీలోని ప్రభుత్వం, జనసేన నేతలు, టీడీపీ నాయకులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలంతా గాలి నా కొడుకులు.. వారాంత గాలికి గెలిచారు అంటూ కామెంట్స్ చేశారు. అయితే పులివెందులలో గెలిచిన వైఎస్ జగన్ కూడా గాలి నా కొడుకేనా? ఆమెకు జగన్ పుట్టాడా? అంటూ టీడీపీ నేతలు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆనం బ్రదర్ చేసిన కామెంట్స్ మరింత వివాదాస్పదంగా మారాయి.


Click it and Unblock the Notifications











