ఏపీ ప్రభుత్వంలో హైపర్ ఆదికి కీలక పదవి.. పవన్ నుంచి అదే ఆశిస్తున్నా.. జబర్దస్త్ కమెడియన్!
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌లో అదిరే అభి టీమ్‌లో ఓ చిన్న కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది తర్వాత తన టాలెంట్‌తో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. గంటల తరబడి ఆగకుండా నవ్వించగల సత్తా ఆది సొంతం. కేవలం తన స్కిట్ కోసమే ప్రేక్షకులు జబర్దస్త్ ఎపిసోడ్ చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్‌లోనూ మిలియన్లకొద్దీ వ్యూలతో సరికొత్త రికార్డులను సృష్టించాడు ఆది. జబర్దస్త్‌లో సత్తా చాటిన హైపర్ ఆది సినిమాల్లోనూ అదరగొడుతున్నాడు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో స్థానం సంపాదిస్తున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఇతర మూవీ ఫంక్షన్‌లలో ఆది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించి సక్సెస్ కావడానికి ఆయన కుటుంబ సభ్యులు , అభిమానులు ఎంతో శ్రమించారు. వీరిలో కొందరిది పరోక్ష సహకారమైతే, ఇంకొందరు ప్రత్యక్షంగా ఆయన వెంట నడిచారు. వీరిలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది ఒకరు. చిన్నప్పటి నుంచి పవన్‌కు వీరాభిమాని కావడంతో ప్రతి విషయంలోనూ ఆయనకు మద్ధతుదారుడిగా నిలిచారు. జనసేన పార్టీలో చేరిన హైపర్ ఆది 2019 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి పార్టీకి అధికార ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. పార్టీ నిర్వహించే పెద్ద సభల్లో తన వాగ్థాటితో అభిమానులు, కార్యకర్తల్లో జోష్ నింపుతారు హైపర్ ఆది.

జనసేనకు చావో రేవో వంటి 2024 ఎన్నికల్లో హైపర్ ఆది విస్తృతంగా సేవలందించారు. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మకాం వేసిన ఆయన .. తన సహచర జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, కిరాక్ ఆర్పీలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. వైసీపీపై ఆయన వేసే పంచ్‌లకు జనం నుంచి మంచి స్పందన లభించింది. పిఠాపురం ఒక్క చోటే కాకుండా కూటమి అభ్యర్ధుల తరపున కూడా ప్రచారం చేశారు ఆది.
అందరి కృషి ఫలించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. అన్నింటికి మించి పదేళ్ల నిరీక్షణ ఫలించి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సాబ్ అనిపించుకున్నారు. ఇది ఆయన అభిమానుల్లో జోష్ నింపింది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను భరించి పవన్ సాధించిన అపూర్వ విజయమిది . అందుకే ఈ గెలుపు చాలా ఏళ్లు నిలిచిపోతుంది. తన విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తెలిపారు. పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే నడిచిన పి . హరిప్రసాద్‌ను ఆయన ఎమ్మెల్సీగా చేశారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండటంతో నసేన పార్టీకి చెందిన నేతల్లో కొందరికి పదవీయోగం పట్టనుంది.

ఈ క్రమంలో హైపర్ ఆది పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనను ఎమ్మెల్సీగా చేసి చట్టసభలోకి పంపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై హైపర్ ఆది స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ శివం భజేలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హైపర్ ఆది మాట్లాడుతూ కళ్యాణ్ కోసం ఎన్నికల్లో ప్రచారం చేశానని, ఆయన గెలిచారు, ఇప్పుడు రూల్ చేస్తున్నారని హైపర్ ఆది చెప్పారు.
నాకు ఎమ్మెల్సీ పదవి లాంటి వాటిపై మక్కువ లేదు. అలాంటి ఆశ కూడా లేదు. పవన్ ఎంత ఇష్టం అంటే ఆయన సంతోషంగా ఉన్నప్పుడు దూరం నుంచి, బాధలో ఉన్నప్పుడు దగ్గరి నుంచి చూడటం ఇష్టమని ఆయన తెలిపారు. అంతకుమించి తాను ఏమీ ఆశించడం లేదని హైపర్ ఆది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











