శ్రీరెడ్డితో వైసీపీ నేత పెళ్లి.. కిరాక్ ఆర్పీ అదిరిపోయే సెటైర్
టాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన టైంలో ఫుల్ ఫేమస్ అయ్యింది శ్రీరెడ్డి. సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని లోబరచుకున్నారంటూ పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో శ్రీరెడ్డి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇతర భాషల హీరోయిన్స్‌ని తెలుగునాట తీసుకోవడానికి వీళ్లేదని చెప్పి బాగానే పోరాడింది. సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా ఆమె వదల్లేదు. అప్పట్లో శ్రీరెడ్డి పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి.
కానీ కాలం గడిచేకొద్దీ శ్రీరెడ్డిని జనం మరిచిపోయారు. ఆమె మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు వదులుతూనే ఉంది. అయినా ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అయితే అనూహ్యంగా శ్రీరెడ్డి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరి స్టైల్లో వేష భాషలు మార్చి వంటల వీడియోలు పెట్టేది. దీనిని నెటిజన్లు బాగానే ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్సుల్లో అందాలను చూపిస్తే.. ఘాటు ఘాటుగా ఎవరో ఒకరిని తిడుతూ ఉండే శ్రీరెడ్డి చీర కట్టుకుని వంట చేసేసరికి కుర్రాళ్లు బాగానే వీక్షిస్తున్నారు.

ఇదిలావుండగా.. రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మద్ధతుగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ఉండేది. సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది. ఇటీవల ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా జగన్ గొప్పదనం గురించి చాలా మాట్లాడింది. అడవుల పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని పొందినట్లు జగన్ కూడా రాజకీయాలను చాకచక్యంగా కొనసాగిస్తారని ఆయన వెంట సైన్యంలా మేమంతా ఉంటామని చెప్పింది. పేదోడు, పెద్దోడు కలిసి జగన్‌ను మోసం చేశారని ఓడిపోయినందుకు బాధపడవద్దని.. క్యాడర్‌కి కొత్త ఊపిరి పోయాలని ఆమె కోరారు.
అయితే.. వైసీపీ యువనేత, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో శ్రీరెడ్డి ప్రేమాయణం సాగిస్తోందని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. కొన్నేళ్ల కిందట సిద్ధార్ధ్ రెడ్డికి ఒక్కరోజు పెళ్లాంగా ఉన్నా చాలు, తర్వాత చచ్చినా పర్లేదు .. నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత చాలాసార్లు బైరెడ్డి లాంటి వ్యక్తి మొగుడిగా రావాలని కామెంట్లు చేసింది. దీనిపై అప్పట్లోనే దుమారం రేగింది.

అయితే ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ట్రోలర్స్ వీరిద్దరిని టార్గెట్ చేశారు. బైరెడ్డితో త్వరలోనే శ్రీరెడ్డి పెళ్లి , రెండేళ్లుగా వీరు రిలేషన్‌లో ఉన్నారంటూ మార్ఫింగ్ ఫోటోలను ఆన్‌లైన్‌లో వదిలి దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై శ్రీరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తనపై విమర్శలు చేసినా పర్లేదని.. కానీ బైరెడ్డి లాంటి యువనేత జీవితాన్ని నాశనం చేయొద్దని అతను చిన్న పిల్లోడని కోరింది. తానెప్పుడూ బైరెడ్డిని చూడలేదని, మాట్లాడలేదని.. అతను బాగుంటాడని గతంలో సిద్ధార్ద్ రెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుందని అన్నానని శ్రీరెడ్డి చెప్పింది.
అయితే బైరెడ్డి, శ్రీరెడ్డి వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ. ఇప్పుడెవరూ శ్రీరెడ్డిని పట్టించుకోవడం లేదని.. బైరెడ్డి కూడా మంచి వయసులో ఉన్నాడని, వన్ సైడ్ లవ్ కాబట్టి నువ్వే సిద్ధార్ధ్ రెడ్డి దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేయాలంటూ ఆర్పీ కామెంట్ చేశారు. బైరెడ్డిని శ్రీరెడ్డి కలిసి కూర్చోని మాట్లాడుకోవాలని.. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు చేసుకోవచ్చని ఆర్పీ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శ్రీరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











