డర్టీ పిక్చర్ చూపించలేదా? ఆ హీరోయిన్ మాటేమిటి? రోజాను కడిగి పారేసిన కిర్రాక్ ఆర్పీ

ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో పోలీస్ ఉన్నతాధికారి సీతారామాంజనేయులు అరెస్ట్‌పై వైఎస్ఆర్సీపీ నేత, సినీ నటి రోజా చేసిన కామెంట్లపై కమెడియన్ జబర్దస్త్ కిరాక్ ఆర్పీ ఘాటుగా స్పందించాడు. రోజా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ప్రతీ కామెంట్‌ను చీల్చి చెండాడాడు. కూటమి ప్రభుత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అయితే రోజా చేసిన కామెంట్స్ ఏమిటి? దానికి కిరాక్ ఆర్పీ ఇచ్చిన కౌంటర్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

సినీ నటి వేధింపుల, అక్రమ అరెస్ట్ కేసులో పోలీస్ ఉన్నతాధికారి సీతారామాంజనేయులు అరెస్ట్‌ను రోజా ఖండించారు. ఆయన అరెస్ట్‌పై కామెంట్ చేస్తూ డైవర్షన్, డర్టీ పాలిటిక్స్‌కు నిదర్శనం. ఏ తప్పు చేయకున్నా ఆయనను అరెస్ట్ చేశారు అని ఆమె అన్నారు. అయితే రోజా చేసిన కామెంట్స్‌ను ఆర్పీ తప్పుపడుతూ.. ముంబైకి చెందిన కాదంబరీ జెత్వానీని ఓ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వేధింపులకు గురి చేశారు. ఆ వ్యవహారంలో ముంబైలో ఉంటున్న ఆమె ఇంటికి నేరుగా వెళ్లి అదుపులోకి తీసుకొన్నారు. విజయవాడలో ఆమెను తీవ్రంగా వేధించిన విషయం రోజాకు తెలియదా? అని ప్రశ్నించారు.

Jabardasth Kirrak RP attack on Actress Roja

మీ ప్రభుత్వం హాయంలో మీరు, మీ వైసీపీ నేతలు డర్టీ పిక్చర్ చూపించారు. గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ చూపించలేదా? దువ్వాడ శ్రీనివాస్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు రాష్ట్రానికి డర్టీ పిక్చర్ చూపించన ఘనతను సొంతం చేసుకొన్నారు. వైఎస్ జగన్ మళ్లీ ఎన్నటీకీ ముఖ్యమంత్రి కాడు. ఇది మీరు కనే పగటి కలలు మాత్రమే. మీరు ప్రజలకు మంచి చేస్తే.. 151 సీట్లలో 5 ఎగిరిపోయి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? అని కిర్రాక్ ఆర్పీ ప్రశ్నించాడు.

చంద్రబాబు విజన్‌ను విస్తరాకుల కట్ట అనడంపై రోజాను కడిగిపాడేశారు. ఇలాంటి మాటలు మీ ప్రభుత్వ హయాలంలో మాట్లాడారు కాబట్టే మీకు 11 ఆకులు వచ్చాయి. నగరిలో మీ ఆకును 45 వేలకుపైగా ఓట్ల తేడాతో చించి.. చాట చేసి గాలికి ఎగిరిపోయింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు. అక్రమంగా సంపాదించిన 3 వేల కోట్ల రూపాయలు నీవు ఇరుక్కొనే కేసుల్లో పొగట్టుకొంటావని ఆర్పీ జోస్యం చెప్పారు.

రోజా చేసిన అక్రమాలపై కిర్రాక్ ఆర్పీ చిట్టా విప్పాడు. తిరుమలలో దర్శనం టికెట్ల కుంభకోణం, ఆడుతా ఆంధ్రాలో వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించావు. నీవు కేసుల్లో ఇరుక్కొంటే.. విస్తరాకులు అమ్ముకోవడం తథ్యం. వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకొన్న ఆనకట్టవు నీవు అని ఆర్పీ మండిపడ్డారు. ఇక మీ ప్రభుత్వం ఎన్నటికీ రాదు. మీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు అని అన్నారు.

ఇదిలా ఉండగా, కాదంబరి జెత్వానీ కేసులో విచారణ చేపట్టిన ఏపీ పోలీసులు ఉన్నతాధికారి సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు. ఆయనను రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇప్పటికే మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను కూడా విచారిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Read more about: kirrak rp kadambari jethwani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X