‘జానీ మాస్టరైనా.. జగన్ అయినా.. లైంగిక వేధింపులకు పాల్పడితే గబ్బర్ సింగ్ ట్రీట్‌మెంటే’
ముంబై నటి కాదంబరి జెత్వానీ లైంగిక వేధింపుల కేసులో రోజుకో ట్విస్టు బయటకు వస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వం హాయాంలో పార్టీ పెద్దల ఆదేశాలతో బాలీవుడ్ నటిని వేధించిన వ్యవహారంలో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడటం అటు సినీ, రాజకీయ, పోలీసు విభాగంలో సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పోలీసుల అరాచకాలపై సాగిన దర్యాప్తు.. ఇక నుంచి రాజకీయ నేతల ప్రమేయంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సూచనలతో ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, సీతారామాంజనేయులపై సస్పెన్షన్ వేటు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాజకీయ నేతల ప్రభావంతో ఇలాంటి అరాచకానికి పాల్పడ్డారా? అనే చర్చ జరుగుతున్నది.

ఇక కాదంబరి జెత్వానీపై నోటి మాట ద్వారా ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారనే ఆరోపనలు అప్పటి విజయవాడ కమిషనర్ క్రాంతి రానా టాటాపై ఆరోపణలు వచ్చాయి.
జెత్వానీపై వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించకుండా ఆమెను అరెస్ట్ చేయాలని అప్పటి విజయవాడ డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నీ ఆదేశాలను జారీ చేయడం భారీ వివాదానికి దారి తీసింది.
ఇక జెత్వానీపై ఎలాంటి కంప్లైంట్ నమోదు కాకముందే ఆమెను అరెస్ట్ చేయాలని క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నికి అప్పటి ఇంటెలిజెన్స్ డీజీపీ పీ సీతారామంజనేయులు ఆదేశాలు జారీ చేయడం అత్యంత వివాదంగా మారింది. ఎవరి ఆదేశాలతో ఉన్నతాధికారులకు అప్పటి డీజీపీ ఆదేశాలు ఇచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతున్నది.

అయితే జానీ మాస్టర్, జెత్వానీ వ్వవహారంపై ఏపీ ప్రభుత్వంలోని కీలక జనసేన మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపుల వ్యవహారంలో జగన్ ఉన్నా.. జానీ మాస్టర్ ఉన్నా.. ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నా వారికి గబ్బర్ సింగ్ ట్రీట్‌మెంట్ ఉంటుందని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని టెలివిజన్ ఇంటర్వ్యూలో వివేక్ బాబు అన్నారు.
Vishal Gunni, IPS (2010) - Former Deputy Commissioner of Police, Vijayawada
Kanthi Rana Tata, IPS (2004) - Former Commissioner of Police, Vijayawada
P. Sitharama Anjaneyulu, IPS (1992) - Former Director General of Police, Intelligence


Click it and Unblock the Notifications











