వచ్చే 19 సంవత్సరాలు పవన్‌‌కు తిరుగులేదు .. ప్రముఖ జ్యోతిష్యుడి కీలక వ్యాఖ్యలు..?

ప్రస్తుతం జనసేన అధినేత , సినీనటుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలోనే అత్యంత ఉచ్ఛ దశలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పడటంలో పవన్ ఎంతో శ్రమించారు. నిజానికి పొత్తు దిశగా అడుగులు వేసింది, బీజేపీకి, టీడీపీకీ మధ్య సయోధ్య కుదిర్చింది అంతా జనసేనానే. ఇందుకోసం తనకు కేటాయించిన సీట్లను కూడా వదులుకుని త్యాగశీలిగా ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో జగన్‌ను గద్దె దించడమే తన అంతిమ లక్ష్యమని, ఇందుకోసం ఓ మెట్టు దిగడానికైనా వెనుకాడేది లేదని చెప్పారు. కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు.

అన్నింటికి మించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి.. తను అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న వారికి తన చేతలతోనే సమాధానం చెప్పారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత జనసేనకు సైన్యానికి గెలుపు రుచి చూపించడమే కాదు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ స్టేటస్‌ను కూడా దక్కించుకున్నారు జనసేనాని. ఆయన గెలుపుతో లక్షలాది మంది అభిమానులు, జనసేన కేడర్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా సోషల్ మీడియాలో పవన్ మేనియా మాత్రం కాస్త కూడా తగ్గలేదు.

janasena chief Pawan Kalyan Horoscope Analysis by astrologer mv suryanarayana

గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. జనసేన నుంచి పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే పవన్‌ ఖచ్చితంగా హోంమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్ర పాలనలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి హోంమంత్రి. కానీ పవన్ మాత్రం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ శాఖలను ఏరికోరి తీసుకునేందుకు ముందుకొచ్చారట.

ఈ నిర్ణయం వెనుక పవన్ ప్లానింగ్ వేరే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిత్యత్తు, తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ జాతకంపై జ్యోతిష్యులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు ఎంవీ సూర్యనారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు శని మహార్ధశ , శనైశ్చరుడు ఆయన జాతక చక్రంలో వృషభరాశిలో ఉచ్ఛ స్ధితిలో ఉన్నాడని తెలిపారు.

శని ప్రభావంతో 19 సంవత్సరాలు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అద్భుతమైన కాలం నడుస్తోందని.. దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు గోచారంలో కొంత బలహీనపడినా ఎదురుదెబ్బలు తట్టుకుని నిలబడతారని సూర్యనారాయణ వెల్లడించారు. పవన్‌ది వృశ్చిక లగ్నమని ఎలాంటి సమస్యలు చుట్టుముట్టినా ఎదుర్కొనే శక్తి ఈ లగ్నానికి ఉందన్నారు. జీవితంలో నెక్ట్స్ లెవల్‌కు వెళ్తూ ఉంటారని, తిరుగులేని ప్రజాదరణతో ప్రజల మధ్య ఉంటూ ఎదుగుతారని సూర్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలకపాత్ర పోషిస్తుందని.. అభివృద్ధి చెందిన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X