Pawan Kalyan: చంద్రబాబు, అమిత్ షా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా సినీ, రాజకీయ , ఇతర రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చి .. చంద్రబాబు, పవన్‌లను ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు.

ప్రమాణ స్వీకారమైతే పూర్తయింది, మంత్రులెవరో తెలిసిపోయింది. మరి చంద్రబాబు ఎవరెవరికీ ఏ పోర్ట్‌ఫోలియో కేటాయిస్తారన్నది ఉత్కంఠగా మారింది. కీలకమైన హోం, ఐటీ, పరిశ్రమలు, ఆర్ధిక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు ఏ పార్టీకి దక్కుతాయి, ఎవరికి అప్పగిస్తారనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ప్రత్యేకించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ప్రభుత్వంలో భాగం కావడతంతో ఆయన ఏ శాఖను తీసుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan rejects chandrababu naidu

పవన్ కళ్యాణ్‌కు తొలి నుంచి దేశభక్తి పాలు ఎక్కువ. స్వతహాగా కానిస్టేబుల్ కొడుకు కావడంతో తండ్రిని యూనిఫాంలో చూస్తూ పెరిగిన ఆయనకు భారతదేశమన్నా, త్రివిధ దళాలు, సాయుధ బలగాలు, పోలీసులంటే ఎనలేని గౌరవం. ఈ విషయాన్ని జనసేనాని ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. సమాజం బాగుండాలని కులమతాలు, పేద- ధనిక అనే అంతరాలు తొలగిపోవాలన్నది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. తన సినిమాల్లో పాత్రలు, పాటలు, సంభాషణల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయన చొరవ చూపారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటే ఏ దేశమైనా అభివృద్ధి దిశగా సాగుతుందన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం.

తన ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఇతర వేదికలపై లా అండ్ ఆర్డర్ ఇష్యూని ఖచ్చితంగా ప్రస్తావించేవారు. ఈ క్రమంలోనే పవన్‌ ఖచ్చితంగా హోంమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్ర పాలనలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి హోంమంత్రి. అందుకే జనసేనాని మరో మాట లేకుండా పవన్‌కు హోంశాఖను అప్పగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇదే శాఖను తీసుకోవాల్సిందిగా పవన్‌ను కోరారట.

కానీ అందరూ ఊహించినట్లుగా చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకవుతారు. ఆయన చర్యలు ఊహలకు, అంచనాలకు అందవు. అంతా హోంమంత్రి అవుతారని భావిస్తుంటే పవన్ మాత్రం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ శాఖలను తీసుకునేందుకు ముందుకొచ్చారు. భారతదేశానికి గ్రామాలే వెన్నెముక అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పేవారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ పటిష్టంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుని బాపూజీ కలలు కనేవారు. పవన్‌ది సైతం అదే బాట.

అలాగే ప్రకృతిని పవన్ ఎంతో ఇష్టపడతారు.. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామని ఆయన నమ్ముతారు. అందుకే హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇంటి కన్నా.. నగరానికి దూరంగా ఉండే తన ఫాంహౌస్‌లో ఉండటమే ఆయనకు ఇష్టం. అందుకే తన వినూత్న ఆలోచనలతో గ్రామాలను , అడవులను అభివృద్ధి చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల వైపు జనసేనాని మొగ్గు చూపినట్లుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X